Bigg Boss 7 Telugu 06th Week Elimination: బిగ్ బాస్ తెలుగు సీజన్ 07 ముందుగా నాగార్జున చెప్పిన విధంగానే ఉల్టా పుల్టాగా సాగుతోంది. అయితే ఆరో వారం ఎలిమినేషన్ లో బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. అయితే ఏడో సీజన్ 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైంది. ఇందులో ఐదుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్ బాస్ 2.0ను స్టార్ట్ చేసి ఐదుగురు కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపాడు పెద్దయ్య. వీరిలో అయింది. దీంతో హౌజ్‌లోకి కొత్తగా ఐదుగురు కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. వారిలో అర్జున్ అంబటి, నయని పావని, పూజా మూర్తి, సింగర్ భోలే షావలి, అశ్వినీ శ్రీ ఉన్నారు. కొత్త కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగుపెట్టి వారం కావస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డేంజర్ జోన్ లో ఆ ఇద్దరూ?
ఇక ఆరో వారం నామినేషనస్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వారే  అమర్ దీప్, ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, నయని పావని, టేస్టీ తేజ, పూజా మూర్తి, అశ్విని శ్రీ. ఈ వారం ఓటింగ్ కూడా బాగానే పోలైనట్లు తెలుస్తోంది. ఓటింగ్ ప్రకారం, తొలి రెండు స్థానాల్లో ప్రిన్స్ యావర్, అమర్ దీప్ ఉన్నారు. ఇక చివరి రెండు స్థానాల్లో అంటే డేంజర్ జోన్‌లో నయని పావని, శోభా శెట్టి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆరో వారం ఎలిమినేషన్ ప్రక్రియలలో బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. 


ట్విస్టు ఇదేనా?
ఈ వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని సమాచారం. ఎందుకంటే ఎలిమినేషన్ నిర్వహిస్తే ఆడియెన్స్ ఓటింగ్ ప్రకారం మళ్లీ ఒక అమ్మాయే హౌస్ నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉంది. ఇదే జరిగితే  బిగ్ బాస్ షోపై నెగెటివ్ ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే ఎలిమినేషన్ అని చెప్పి.. వారికి సీక్రెట్ రూమ్ కు పంపించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే గౌతమ్ సీక్రెట్ రూమ్ లోకి వెళ్లి వచ్చాడు. మళ్లీ ఇప్పుడు సీక్రెట్ రూమ్ లోకి పంపిస్తారంటే అది కూడా సందేహమే. అయితే ఈ వారం శోభా శెట్టి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 


Also Read: Vyooham Trailer: ఏపీలో పొలిటికల్ హీట్ పెంచబోతున్న ఆర్జీవీ.. ఇంట్రెస్టింగ్‌గా 'వ్యూహం' ట్రైల‌ర్‌..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి