Bigg Boss 7 Telugu Winner: ముగ్గురి మధ్యే టైటిల్ పోరు.. అయితే గెలిచేది మాత్రం అతడే!
BB 7 Telugu final voting: బిగ్ బాస్ 7 తెలుగు ఆఖరికి వచ్చేసింది. విజేత ఎవరో ఆదివారం తెలిసిపోనుంది. మరికాసేపట్లో ఓటింగ్ పూర్తికానుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ టైటిల్ ఎవరో కొడతారనేది అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
Bigg Boss 7 Telugu Title Race: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ చివరి దశకు వచ్చేసింది. మరో రెండు రోజుల్లో విన్నర్ ఎవరో తేలిపోనుంది. ఈరోజు రాత్రి వరకే ఓటింగ్ పోల్స్ అందుబాటులో ఉంచుతారు. డిసెంబరు 17న గ్రాండ్ ఫినాలే నిర్వహించి విజేత ఎవరో ప్రకటిస్తారు. ఈ సారి తెలుగు బిగ్ బాస్ ఫినాలేకు గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు రానున్నారని తెలుస్తోంది. గుంటూరు కారం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా.. ఆయన బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేయనున్నారు.
ఇక బిగ్ బాస్ ఫినాలేకు వెళ్లిన వారిలో ప్రశాంత్, శివాజీ, యావర్, ప్రియాంక, అమర్ దీప్, అర్జున్ అంబటి ఉన్నారు. ఫినాలేకు ఆరుగురు వెళ్లడం ఇదే తొలిసారి. కిందటి వారం నుంచి ఓటింగ్ లైన్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఎవరి ఫేవరెట్ కంటెస్టెంట్స్ కు వారు ఓట్లు వేస్తున్నారు. ఓటింగ్ చూస్తుంటే టైటిల్ పోరు ముగ్గురి మధ్య ప్రధానంగా సాగుతోంది. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, హీరో శివాజీ, సీరియర్ నటుడు అమర్ దీప్ చౌదరిలకే ఎక్కువ పోలింగ్ జరుగుతోంది. ముగ్గురికి ప్రజల నుంచి కాస్తా అటు ఇటుగా ఓట్లు పడుతున్నాయి.
ఇదిలా ఉండగా.. అన్ అఫీషియల్ ఓటింగ్స్‌లో మాత్రం రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రశాంత్ తర్వాత స్థానంలో హీరో శివాజీ, మూడో స్థానంలో అమర్ దీప్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక రకంగా చూస్తే ఈసారి సీజన్ విన్నర్ ప్రశాంత్ అని తెలిసిపోతుంది. గతంలో కూడా అన్ అఫీషియల్ పోల్స్ చెప్పినవి నిజమైన సందర్భాలు ఉన్నాయి.
Also Read: Youtuber Chandu Sai Arrest: రేప్ కేసులో ప్రముఖ తెలుగు యూట్యూబర్ అరెస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook