Bigg Boss 7 Telugu Grand Finale: మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ విన్నర్ ఎవరనేది తెలిసిపోనుంది. 19 మంది కంటెస్టెంట్లతో 105 రోజులపాటు సాగిన బిగ్ బాస్ సీజన్ 07 ప్రయాణం నేటితో ముగియనుంది. అయితే ఈసారి విన్నర్ ఎవరనేది అడియెన్స్ ఊహించలేకపోతున్నారు. ఉల్టా పుల్టా సీజన్ కాబట్టి ఏదైనా జరిగే అవకాశం ఉంది. టాప్-6 కంటెస్టెంట్లుగా అమర్, ప్రశాంత్, ప్రియాంక, శివాజీ, యావర్, అర్జున్ నిలిచారు. అయితే టైటిల్ రేసు ముగ్గురి మధ్య నడుస్తోంది. ఎక్కువ ఓటింగ్ శివాజీ, ప్రశాంత్, అమర్ లకే పోలైంది. సోషల్ మీడియాలో అయితే కొందరు ప్రశాంత్ విన్నర్ అంటుంటే.. మరికొందరు అమర్ అని అంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాసేపట్లో ఫినాలే ప్రారంభం కానున్న నేపథ్యంలో... తాజాగా బిగ్‏బాస్ గ్రాండ్ ఫినాలే ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. సో బ్యూటిఫుల్.. సో ఎలిగెంట్.. జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్” అంటూ నాగార్జున డైలాగ్ ప్రోమో మెుదలైంది. ఆ తర్వాత ఎక్స్ హౌస్ మేట్స్ మాట్లాడారు. బిగ్ బాస్ తర్వాత లైఫ్ ఎలా ఉందని నాగ్ అడగ్గా.. పదిరెట్లు బెటర్ గా ఉందని దామిని జవాబిచ్చింది. తనకు 15 సినిమా ఆఫర్స్ వచ్చాయని తేజా చెప్పాడు. జనాలు అందరూ తనని మనోభావాల పాప అని అంటున్నారని శుభ శ్రీ చెప్పగా.. నన్ను అయితే హీరో అంటున్నారని భోలే చెప్పాడు. ఆ తర్వాత బిగ్ బాస్ స్టేజ్ పై కళ్యాణ్ రామ్, నరేష్, రాజ్ తరుణ్, సుమ, రోషన్ ఇలా చాలా మంది గెస్ట్స్ వచ్చారు.  


Also Read: Bigg Boss 7 Winner: ఈసారి బిగ్‌బాస్ విన్న‌ర్ ప్రైజ్ మ‌నీ ఎంతో తెలుసా?


చివరగా మాస్ మహారాజా రవితేజ స్టేజ్ పై సందడి చేశాడు. అమర్ రవితేజకు ఫ్యాన్ అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాగార్జున మాట్లాడుతూ.. “అమర్.. నీకు అద్భుతమైన ఆఫర్ ఇస్తున్నా.. గేట్లు ఓపెన్ చేస్తున్నా.. ఇప్పుడు నువ్వు అన్నీ వదిలేసి వచ్చేస్తే.. రవితేజ నెక్ట్స్ సినిమాలో అతడితో కలిసి నటించే అవకాశం వస్తుంది.. నీకు ఏడు సెకన్స్ టైం ఇస్తున్నా.. బిగ్‏బాస్ హౌస్ లో ఉంటావా? లేదంటే రవితేజ సినిమాలో నటిస్తావా? అని అడిగారు. అయితే అమర్ మాత్రం క్షణం ఆలోచించకుండా పరుగుతుకుంటూ రావడాన్ని ప్రోమోలో చూపించింది బిగ్ బాస్ టీం. అతడి అభిమానాన్ని చూసి రవితేజ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఏం జరిగిందో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. 



Also read: Ravi Teja: రవితేజ కి పర్ఫెక్ట్ టైటిల్…మరోసారి హరిష్ శంకర్ దర్శకత్వంలో హిట్ షురూ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి