Bigg Boss 7 Nominations: బిగ్ బాస్ మూడో వారంలోకి అడుగుపెట్టింది. మెుదటి రెండు వారాలు ఆసక్తికరంగా సాగిన బిగ్ బాస్ మూడో వారం కొంచెం డల్ అయిందనే చెప్పాలి. రెండోవారం నామినేషన్స్ ప్రక్రియతో బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్స్ ఊహించని రేంజ్ కు వెళ్లింది. అయితే మూడోవారం జరిగిన నామినేషన్ ప్రక్రియ అస్సలు ఇంట్రెస్టింగ్ లేదు. ఎందుకంటే కంటెస్టెంట్స్ సిల్లీ రీజన్స్, చిన్న చిన్న కారణాలు చెప్పి నామినేషన్స్ చేశారు. దీంతో సోమవారం ఎపిసోడ్ ఆడియెన్స్ ను అంతగా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం హౌస్ లో 12 మంది ఉన్నారు. వీరిలో సందీప్, శివాజీ దగ్గర పవర్ అస్త్ర ఉండటంతో ఆ ఇద్దరు ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నారు. దీంతో మిగిలిన 10 మందికి నామినేషన్ ప్రక్రియ పెట్టాడు బిగ్ బాస్. ఇందులో ఏడుగురు నామినేట్ అయ్యారు. వీరిలో శుభశ్రీ, ప్రియాంక, గౌతమ్ కృష్ణ, దామిని, యావర్, రతిక, అమర్ దీప్ ఉన్నారు. మంచి నీళ్లు అడిగారని, గిన్నెలు తోమలేదని ఇలా సిల్లీ రీజన్స్ చెప్పి నామినేషన్ వేశారు కొందరు. దామిని, యావర్ మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. ముఖ్యంగా దామిని మీద యావర్ గట్టిగా అరిచాడు. గత రెండు వారాలుగా నామినేషన్స్ లో లేని శుభశ్రీని కొందరు కంటెస్టెంట్స్ కావాలని టార్గెట్ చేసి నామినేట్ చేశారు. ఈసారి అమర్ దీప్, ప్రియాంక కూడా నామినేషన్స్ లోకి వచ్చారు. 


శుభశ్రీ, ప్రియాంక, గౌతమ్ కృష్ణ, దామిని, యావర్, రతిక, తేజ నామినేట్ అయిన సమయంలో బిగ్ బాస్ చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. సందీప్, శివాజీ దగ్గర పవర్ అస్త్రాలు ఉన్న కారణంగా వారికి ఓ టాస్క్ ఇచ్చాడు. నామినేషన్స్ లో ఉన్న ఓ కంటెస్టెంట్ ను సేవ్ చేసి, అలాగే సేఫ్ గా ఉన్న కంటెస్టెంట్స్ లోని ఒకరిని నామినేట్ చేయాలని చెప్పాడు. దీంతో నామినేషన్స్ లో ఉన్న తేజను సేవ్ చేసి.. అమర్ దీప్ ను సెలక్ట్ చేశారు శివాజీ, సందీప్. దీంతో అమర్ దీప్ కాస్త అసహనం వ్యక్తం చేశాడు. 


Also Read: Varun Tej: వరుణ్ ఇంట్లో ఘనంగా గణపతి ఉత్సవాలు.. స్పెషల్ ఎట్రాక్షన్ గా కాబోయే కోడలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి