Bigg Boss 7 Telugu 8th Week Elimination: బిగ్ బాస్ తెలుగు సీజన్ 07 ఊహించని ట్విస్టులతో దూసుకుపోతుంది. అయితే ఎనిమిదో వారం ఎలిమినేషన్ లో ఊహించని ట్విస్టు చోటుచేసుకోబోతుంది. ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ నుంచి అందరూ అమ్మాయిలే ఎలిమినేట్ అయ్యారు. ఈసారి కూడా అమ్మాయే హౌస్ నుంచి వెళ్లిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం నామినేషన్స్ లో ఎనిమిది మంది ఉన్నారు. వారే ప్రియాంక జైన్, శివాజీ, అమర్ దీప్ చౌదరి, శోభా శెట్టి, ఆట సందీప్, సింగర్ భోలే, గౌతమ్ కృష్ణ, అశ్విని శ్రీ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఓటింగ్ విషయానికొస్తే.. అత్యధిక ఓటింగ్ సాధించి హీరో శివాజీ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. సెకండ్ స్థానంలో సీరియల్ హీరో అమర్ దీప్ ఉన్నాడు. మూడో స్థానంలో సింగర్ భోలే, నాలుగో స్థానంలో గౌతమ్ కృష్ణ కొనసాగుతున్నారు. ఇక చివరి రెండు స్థానాల్లో తక్కువ ఓటింగ్ అశ్విని శ్రీ, శోభా శెట్టి ఉన్నారు. ఓటింగ్ ప్రకారం చూస్తే.. ఈసారి సీరియల్ నటి మోనిత అలియాస్ శోభా శెట్టి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 


అయితే ఆరో వారం శోభా శెట్టిని కాపాడేందుకు నయని పావనిని బలిచేసింది బిగ్ బాస్ టీమ్. ఈ సారి కూడా ఆమెను రక్షించేందుకు పెద్దయ్య అశ్వినీని బలి చేయబోతున్నట్లు తెలుస్తోంది. హౌస్ లో అతి చేయడంతోపాటు అరుస్తూ, గొడవలు పెట్టుకుంటూ బాగా కంటెంట్ ఇస్తుండటంతో శోభా శెట్టిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారట.  మరోవైపు అశ్విని టాస్కులు సరిగ్గా ఆడకపోవడం, ఎక్కువగా ఎమోనషల్ అవ్వడం, భోలేతో తప్ప ఇతర హౌస్ మేట్స్ తో పెద్దగా కలవకపోవడం ఈ బ్యూటీకి మైనస్. మరోవైపు ఈ వారం నో ఎలిమినేషన్ కూడా ఉండే అవకాశం ఉంది. 


Also Read: BB 7 latest Promo: యావర్ పై శోభా ఓవర్... పిచ్చోడంటూ రెచ్చిపోయిన మోనిత..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.