BB 7 Telugu Updates: ఒక్కొక్కరికి ఇచ్చిపడేసిన నాగ్.. తెల్లముఖాలు వేసిన హౌస్ మేట్స్..
BB 7 Telugu Updates: ఈరోజు ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఇందులో ఒక్కో కంటెస్టెంట్ కు ఇచ్చిపడేశాడు నాగార్జున.
Bigg Boss 7 Telugu latest Promo: గత సీజన్లతో పోలిస్తే ఈసారి హోస్టింగ్ తో ఇరగదీస్తున్నాడు నాగార్జున. హౌస్ మేట్స్ తప్పులు చేస్తే వీకెండ్ లో కడిగిపారేస్తున్నాడు కింగ్. ప్రతి వారం నాగ్ క్లాస్ పీకుతున్న కంటెస్టెంట్స్ ప్రవర్తనలో ఎటువంటి మార్పు రావడం లేదు. వారాలు గడుస్తున్నా కొద్దీ హౌస్ మేట్స్ పొరపాట్లు సరిదిద్దుకోవడం మానేసి తప్పులు మీద తప్పులు చేస్తున్నారు. అయితే ఎప్పటిలాగే ఈ వారం కూడా కూడా నాగ్ ఒక్కొక్కరికి గట్టిగానే ఇచ్చిపడేసినట్లు తాజా ప్రోమో చూస్తే తెలుస్తోంది.
ముందుగా స్టేజ్ మీద కంటెస్టెంట్ల ఫోటోలతో ఉన్న కుండలను పగలగొట్టి నిజాలు చెప్పాలంటూ అడుగుతాడు నాగ్. తొలుత అశ్వినిని నిల్చోబెట్టి.. ఎందుకు చేశావమ్మా అలా అని అడగ్గా.. ఏం చేశాను సర్ అంటూ అమాయకంగా అడుగుతోంది. నువ్వు మాట్లాడేటప్పుడు ఏయ్, పోరా అంటూ మాట్లాడేస్తున్నావు. ఇక ఆ తర్వాత సింగర్ భోలే షావలిని.. మన ఊర్లో.. మన ఇంట్లో మన వాడుకలో పదాలు కొన్ని ఉండొచ్చు. ఎర్రగడ్డ అనే పదం ఏ ఫ్లోలో వచ్చింది అని అడగ్గా.. ఆమె సెన్స్ లెస్ అన్నది అంటూ భోలే చెప్పడంతో సెన్స్ లెస్.. మెంటల్ కు చాలా తేడా ఉంది నీకు తెలీదా అంటూ ప్రశ్నించాడు.
మాట జారిన తర్వాత సారీ అడిగిన కూడా అది వర్కవుట్ అవ్వదు అని ప్రియాంకను అన్నాడు కింగ్. శోభా.. అమర్ అలా తినేసినప్పుడు బిగ్ బాస్ కు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు. అంటే గ్రూపిజమా ?.. అనడంతో.. అమాయకంగా ముఖం పెట్టేసింది శోభా. ఇక ఆ తర్వాత అమర్.. కేక్ తినడం వల్ల నువ్వు ఎంత పెద్ద చిక్కుల్లో పడ్డావో నీకు తెలుసా ?.. అంటూ క్లాస్ పీకాడు. తేజా నీ నుంచి ఇది అస్సలు ఊహించలేదు.. ఒకరిని రెచ్చగొట్టేయడం.. ఇది శాడిజంలాగా కనిపిస్తుంది అంటూ క్లాస్ తీసుకున్నారు. ఆ తర్వాత ప్రశాంత్, సందీప్ ఇద్దరినీ నిల్చోబెట్టి.. సందీప్ ఒట్టేశాడు.. నువ్వు ఎందుకు వేయలేదు అని అడిగాడు. ఒకరిపై నింద వేసేటప్పుడు నిజమై ఉండాలి. ఊరోడు అనడం తప్పా ?. ప్రతి ఒక్కరు ఊరి నుంచి వచ్చినవారే. మా నాన్న ఊరోడు. గర్వంగా చెప్తున్నాను. అందులో తప్పేమి లేదు అన్నారు నాగ్. మొత్తానికి ప్రోమో చూస్తుంటే ప్రతి ఒక్కరికి ఇచ్చిపడేశాడు నాగ్.
Also Read: BB 7 Telugu latest Promo: అమర్ చెత్త రీజన్.. కంటతడి పెట్టిన శివాజీ..
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook