Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ ప్రతి సీజన్ కు ఏదో ఒక లవ్ స్టోరీ ఉండేది. ఈ సీజన్ లో కూడా అలాంటి ప్రేమ కథ ఉంటుందోమోనని ఆడియెన్స్ ఆశించారు. అందుకు తగ్గట్టే తొలి వారంలో ప్రశాంత్, రతిక రోస్ లవ్ ట్రాక్ నడిచింది. కానీ నామినేషన్స్ సమయంలో రతిక ట్విస్ట్ ఇచ్చింది. ప్రశాంత్ కు వ్యతిరేకంగా మాట్లాడి అతడిని హార్ట్ చేసింది. అదే సమయంలో వీరిద్దరి మధ్యలోకి  ప్రిన్స్ యావర్ ఎంటర్ అయ్యాడు. రతికతో క్లోజ్ గా ఉంటూ ఆమెతో లవ్ ట్రాక్ నడిపాడు ప్రిన్స్. ఇది చూసి ప్రశాంత కాస్త బాధపడినట్లు అనిపించింది. అంతేకాకుండా ఒకనొక సమయంలో యావర్ ను రతికను లవ్ చేస్తున్నావా అని కూడా అడిగేశాడు ప్రశాంత్. ఆమె అంటే తనకిష్టమని యావర్ కూడా చెప్పాడు. దీంతో అప్పటి నుంచి ప్రశాంత్ ఆమెతో మాట్లాడటం మానేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే తాజాగా ప్రశాంత్, రతిక సరదాగా మాట్లాడుకుంటున్న వీడియోను రిలీజ్ చేశాడు బిగ్ బాస్. ఇందులో రతిక బెడ్ రూమ్ లో పడుకుని ఉంటుంది. మధ్యలో గ్లాస్ అడ్డుగా ఉంటుంది. ఇటువైపు ప్రశాంత్ ఉన్నాడు. కొంచెం ముందుకు రా అని ప్రశాంత్ అన్నట్లుగా తాజాగా బిగ్ బాస్ రిలీజ్ చేసిన వీడియోలో కనిపిస్తుంది. నాగ్ సార్ ముందు డ్యాన్స్ రాదని బాగా చేశావే అని రతిక ప్రశాంతను పొగడగా.. తాను డిస్కో డ్యాన్సర్ అంటూ ప్రశాంత్ పాట పాడాడు. అంతేకాకుండా ఫ్లోర్ మూమెంట్ కూడా వేశాడు. దీంతో వీరిద్దరూ నవ్వుకున్నారు. దీనిని బట్టి వీరిద్దరూ కలిసిపోయారని ఆడియెన్స్ అంటున్నారు. మరి వీరి ప్రేమాయణం ఎటువైపు దారి తీస్తుందో చూడాలి.



సోమవారం మూడోవారం నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. ఈసారి నామినేషన్స్ లో ఏడుగురు ఉన్నారు. ఇందులో శుభశ్రీ, ప్రియాంక, గౌతమ్ కృష్ణ, దామిని, యావర్, రతిక, అమర్ దీప్ ఉన్నారు. ఈసారి నామినేషన్స్ ప్రక్రియ అంత ఇంట్రెస్టింగ్ గా లేదు. సిల్లీ రీజన్స్ చెప్పి కంటెస్టెంట్స్ నామినేషన్ చేయడంఆడియెన్స్ కు బోర్ కొట్టించింది. 


Also Read: Bigg Boss 7: సిల్లీ రీజన్స్ తో కంటెస్టెంట్స్ రచ్చ రచ్చ.. మూడో వారం నామినేషన్లో ఎవరున్నారంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook