Akhil Sarthak Injured : బీబీ జోడి షోలో అన్యాయం?.. బాధగా ఉందంటూ అఖిల్ సార్థక్ ఎమోషనల్ వీడియో
Bigg Boss Akhil Sarthak Surgery బీబీ జోడిలో అఖిల్ గాయపడ్డాడన్న సంగతి తెలిసిందే. అఖిల్ తన గాయానికి సంబంధించిన విషయాలను నాడు బయట పెట్టలేదు. కానీ అఖిల్ మాత్రం ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశాడు.
Bigg Boss Akhil Sarthak Surgery బీబీ జోడిలో పర్ఫామెన్స్ చేస్తున్న సమయంలోనే అఖిల్ సార్థక్‌కు గాయం ఎక్కువైంది. బొడ్డు కింది భాగంలో ఈ నొప్పి మొదలైందట. ఎప్పటి నుంచో ఈ నొప్పి ఉండగా.. పెద్దగా పట్టించుకోలేదట. కానీ ఇక పర్ఫామెన్స్ చేస్తున్న సమయంలో ఆ బాధను భరించలేకపోయాడట. అది చాలా పెద్దదైందట. దీంతో ఆపరేషన్ చేయాల్సి వచ్చిందట. ఈ విషయం గురించి అఖిల్ పూర్తిగా చెబుతూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు.
'ఎపిసోడ్‌లో ఏం జరిగిందో సరిగ్గా చూపించలేదు.అందుకే ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నా.. నా నొప్పి జనాలకు కనిపించదు.. షో మధ్యలోంచి వెళ్లిపోయాని అనుకుంటారు.. మేం లీస్ట్ నుంచి టాప్ 2లో ఉన్నామనేది షాకింగ్‌గా అనిపించింది.. నేను నెక్ట్స్ ఎపిసోడ్‌కు రాలేనని చానెల్ వాళ్లకి తెలుసు.. అందుకే ఇలా చేసి ఉంటారు.. మమ్మల్ని కిందకి లాగితే ఇంకొకరిని సేవ్ చేయొచ్చనే ఆలోచనలో ఉన్నారేమో.
నేనూ తేజ్ మా బెస్ట్ ఇచ్చాం.. అయినా ఎంతో కష్టపడ్డాం. నేను నొప్పితో బాధపడ్డాను అంటే ఏ ఒక్కరూ నమ్మడం లేదు అదే నాకు బాధగా ఉంది.. షో నుంచి వెళ్లిపోవడానికి కారణాలు వెతుక్కుంటున్నాడని నా వెనకాల మాట్లాడుతున్నారు.. నాకు వెళ్లాలనే ఉంటే.. అసలు షోలోకి ఎందుకు వస్తాను.. ఎందుకు సైన్ చేస్తాను.. ఇన్ని రోజులు ఇంతలా ఎందుకు కష్టపడతాను.
ఇవన్నీ పక్కన పెడితే.. మీరు ఇన్ని రోజులు నాకు ఇచ్చిన ప్రేమ, సపోర్ట్‌కు థాంక్స్. మీరు లేకపోతే బీబీ జోడి నథింగ్. మీ వల్లే అంత మంచి రేటింగ్స్ వచ్చాయి. నన్ను క్షమించండి.. మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు శాయశక్తుల ప్రయత్నించాను.. కానీ ఇలా వెళ్లిపోయాను.. అయినా ఏం జరిగినా మన మంచికే కదా?.. నేను మళ్లీ రెట్టింపు వేగంతో తిరిగి వస్తాను'.. అంటూ అకిల్ ఎమోషనల్ అయ్యాడు.
దీంతో బీబీ జోడి తమను కావాలనే అన్యాయం వెళ్లగొట్టేసిందని చెప్పకనే చెప్పేశాడు అఖిల్. బీబీ జోడిలో అఖిల్ తేజస్వీ జోడికే ఎక్కువ పాపులారిటీ వచ్చిందన్న సంగతి తెలిసిందే. అలాంటిది ఈ ఇద్దరినే తొలగించడం మాత్రం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.
Also Read: Deepthi Sunaina : బ్లాక్ చేశాడంటూ ఎమోషనల్.. వేడుకుంటోన్న దీప్తి సునయన
Also Read: Niharika Konidela Divorce : ఈ ఒక్క ఫోటోను మాత్రం డిలీట్ చేయని చైతన్య.. నిహారికతో విడాకులు కన్ఫామ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook