Bigg Boss Ashu Reddy Hospitalised బిగ్ బాస్ అషూ రెడ్డి తాజాగా హాస్పిటల్ బెడ్డు మీద కనిపించింది. చేతికి సెలైన్లు పెట్టినట్టుగా కూడా కనిపిస్తోంది. అషూ రెడ్డి ఇలా అకస్మాత్తుగా హాస్పిటల్ బెడ్డు మీద కనిపించడంతో ఆమె అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. అషూ రెడ్డికి ఏమైందా? అని కంగారు పడుతున్నారు. ఎప్పుడూ చలాకీగా తిరుగుతుండేవాళ్లు ఇలా అయిపోతే కష్టంగా ఉంటుంది అని అభిమానులు కామెంట్లు పెడుతుండగా.. వాటికి రిప్లై ఇచ్చింది. తాను ఇప్పుడు త్వరగానే కోలుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అషూ రెడ్డి ఈ మధ్య ఎక్కువగా వెకేషన్స్ అంటూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఒక రోజు దుబాయ్ అంటుంది.. ఇంకో రోజు అమెరికా అంటుంది. ఇలా అటూ ఇటూ తిరుగుతూనే ఉంటుంది. మొన్నటి వరకు అషూ రెడ్డి రాహుల్ సిప్లిగంజ్‌లు కలిసి దుబాయ్‌లో సందడిచేశారు. రాహుల్ చేసిన వన్ మినిట్ మ్యూజిక్ వీడియో కోసం అషూ రెడ్డి వెళ్లినట్టుగా తెలుస్తోంది.ఈ ఇద్దరూ అక్కడ అలా ఏకాంతంగా ఉండటంతో జనాలు రకరకాలుగా కామెంట్లు చేశారు.


అలా అషూ మీద నిత్యం ఏదో ఒక ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. బుల్లితెరపై ట్రాకులు నడిపిస్తూ కాలం వెళ్లదీస్తోందని అంటూ ఉంటారు. ఇక తనకు క్రేజ్ తగ్గుతుందని అనుకునే సమయంలో బోల్డ్ ఇంటర్వ్యూలు, ఆర్జీవీతో కలిసి వీడియోలు చేయడం, హాట్ ఫోటో షూట్లు చేయడంతో మళ్లీ తన ఇమేజ్‌ను పెంచుకుంటుందని జనాలు తిడుతుంటారు. ఆర్జీవీ అషూ రెడ్డి చేష్టలు మాత్రం హద్దులు దాటుతుంటాయనే విమర్శ ఎప్పుడూ వస్తూనే ఉంటుంది.


[[{"fid":"265624","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


అషూ రెడ్డికి ఇప్పుడు బుల్లితెరపై అవకాశాలు తగ్గినట్టుగా అనిపిస్తోంది. ఆమెకు బుల్లితెరపై ఇప్పుడు  చాన్సులు రావడం లేదు. ఏ షోలోనూ ఆమె కనిపించడం లేదు. ఇక వెండితెరపై హీరోయిన్‌గా అడపాదడపా చాన్సులు వస్తున్నాయి. గత ఏడాది ఫోకస్ అనే సినిమాతో హీరోయిన్‌గా వచ్చింది. ఇంకో సినిమాను కూడా ఆమె ఓకే చేసింది. కానీ ఈ సినిమాలేవీ అషూ రెడ్డికి కెరీర్ పరంగా ఉపయోగపడం లేదనిపిస్తోంది.


Also Read:  Oscars 2023 Live Updates: ఆస్కార్ విజేతల జాబితా, ఎవరెవరికి ఏ అవార్డులు


Also Read: Oscars 2023: తెలుగోడి సత్తాచాటిన 'నాటు నాటు'. Naatu Naatu పాటను వరించిన ఆస్కార్ అవార్డు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook