Actress Sada Emotional : అవినాష్ కాళ్లు మొక్కిన సదా.. దెబ్బకు ఫిదా.. గుండెను పిండేశాడట!
Sadaa Touches Avinash Feet బీబీ జోడి ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో అవినాష్ చేసిన అదిరిపోయే పర్ఫామెన్స్‌ను చూసి సదా ఫిదా అయింది. కుర్చీలోంచి లేచి వచ్చిన అవినాష్ కాళ్లు మొక్కే ప్రయత్నం చేసింది.
Sadaa Touches Avinash Feet in BB Jodi బుల్లితెరపై డ్యాన్స్ షోలు, కామెడీ షోలు ఎక్కువగా ట్రెండ్ అవుతుంటాయి. ఇక అందులో టీఆర్పీ కోసం వేసే స్టంట్లు జనాలను నవ్విస్తుంటాయి. అవి టీఆర్పీ స్టంట్లే అని తెలిసినా కూడా మళ్లీ మళ్లీ అవే స్ట్రాటజీలను వాడుతూ ఉంటారు. అయితే తాజాగా బీబీ జోడి షో ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. మొదటి సారిగా డ్యాన్స్ షోలో ఢీ షోని ఢీ కొట్టి బీబీ జోడి టాప్‌లో నిల్చింది.
బీబీ జోడికి మంచి టీఆర్పీ రేటింగ్‌లు వస్తున్నాయట. అందుకే ఇంకా మరింత మోతాదును పెంచేశారు. ఇప్పుడు వదిలిన ప్రోమోలో మోహబూబ్, సత్య రెచ్చిపోయారు. ముద్దులతో నానా హంగామా చేశారు. బీబీ జోడిలో కంటెస్టెంట్లు హద్దులు దాటుతున్నారు.
ఇక అవినాష్ చేసిన ఒక పర్ఫామెన్స్‌కు అంతా ఫిదా అయ్యారు. సదా అయితే స్టేజ్ మీద నుంచి కిందకు వచ్చింది. అవినాష్ కాళ్లను మొక్కేందుకు కిందకు వంగింది. కానీ అవినాష్ మాత్రం వద్దని వారించాడు. ఆ తరువాత అవినాష్‌కు సదా హగ్ ఇచ్చింది. అవినాష్ చేసిన పర్ఫామెన్స్‌కు ఫిదా అయినట్టుగా సదా చెప్పింది.
హిజ్రాలు సమాజంలో ఎదుర్కొంటోన్న సవాళ్లు, అవమానాలను అవినాష్ తన పర్ఫామెన్స్‌తో చూపించాడు. వారి బాధను అంత గొప్పగా చూపించిన అవినాష్ పర్ఫామెన్స్ పట్ల సదా ముగ్దురాలైంది. ఇంత వరకు ఎవ్వరూ కూడా ఇంత గొప్పగా వారి బాధలను చూపించలేదు అని చెప్పుకొచ్చింది.
ఇక రాధ అయితే తనకు ఎదురైన అనుభవం గురించి చెప్పింది. ఒక పెళ్లిలో తనకు ఎదురైన ఘటన గురించి వివరించింది. మగవాళ్లలోని శక్తి, ఆడవాళ్ల హృదయం కలగలిపి వారికే ఉంటుందని హిజ్రాల గురించి గొప్పగా చెప్పింది. ఇప్పుడు ఈ ప్రోమో అయితే అందరినీ కదిలించేస్తోంది. అవినాష్ ఎమోషనల్ పర్ఫామెన్స్, మెహబూబ్ రొమాంటిక్ డ్యాన్స్ నంబర్లతో ప్రోమో వైరల్ అవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook