Pushpa 2: బిగ్ బాస్ భామకి మెగా ఆఫర్.. అనసూయ లెవెల్ లో మరవనున్న మరో నటి..
Bigg Boss Divi: తెలుగు బిగ్ బాస్ 4వ సీజన్ లో తన అందచందాలతో ఆకట్టుకున్న.. దివి వద్త్య 2022 లో మెగాస్టార్ చిరంజీవి నటించిన.. గాడ్ ఫాదర్ సినిమాలో నటించింది. ఆ తర్వాత కూడా పెద్ద చెప్పుకోదగ్గ ఆఫర్లు రాలేదు కానీ తాజాగా అల్లు అర్జున్ పుష్ప 2.. సినిమాలో అవకాశం కొట్టేసి ఈ భామ మరొకసారి వార్తల్లో నిలిచింది.
Divi Vadthya in Pushpa 2: తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో కనిపించిన బ్యూటీ బిగ్ బాస్ కి..ముందు మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి.. సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. బిగ్ బాస్ ఫినాలే లో.. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఆమెకి.. గాడ్ ఫాదర్ సినిమాలో ఆఫర్ ఇచ్చారు.
2022లో విడుదలైన గాడ్ ఫాదర్ సినిమాలో.. దివి మంచి పాత్రలోనే కనిపించింది. ఆ సినిమా తర్వాత ఆమె పలు చిన్న బడ్జెట్ సినిమాలలో.. కూడా కనిపించింది. రుద్రాంగి, క్యాబ్ స్టోరీస్ ఇంకా ఈ మధ్యనే విడుదలైన లవ్ మీ ఇఫ్ యు డేర్.. సినిమాలలో కూడా కనిపించింది.
సినిమాలతో కంటే దివి.. తన సోషల్ మీడియా ఫోటోలతో ఇంకా బాగా పాపులర్ అయింది అని చెప్పుకోవచ్చు. అందమైన ఫోటోషూట్లతో.. దివి అందరు దృష్టి బాగానే ఆకట్టుకుంటూ వస్తోంది. అయితే ఇప్పటిదాకా చిన్న సినిమా.. ఆఫర్లు మాత్రమే అందుకుంటున్న దివికి ఇప్పుడు ఏకంగా ఫ్యాన్ ఇండియా సినిమాలో నటించే.. అవకాశం వచ్చింది.
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమాలో.. దివి కూడా ఒక చిన్న పాత్రలో కనిపించబోతుందట. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో, సుకుమార్ వంటి ..టాలెంటెడ్ డైరెక్టర్ చేస్తున్నా సినిమాలో తను కూడా ఒక భాగం కావటంతో దివి సంతోషంలో మునిగితేలుతోంది. ఆల్రెడీ పార్ట్ వన్ లో జబర్దస్త్ బ్యూటీ అనసూయకి.. చాలా కీలకపాత్ర ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి అనసూయ అంత పాత్ర కాకపోయినా.. దివికి కూడా సెకండ్ పార్ట్ లో కొంచెం ముఖ్యపాత్ర ఉండొచ్చు అని వినికిడి.
పుష్ప సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. పుష్ప 2 మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక సినిమాలో కూడా దివికి.. మంచి పాత్ర దొరికితే ఖచ్చితంగా ఆమెకి మరిన్ని ఆఫర్లు.. వచ్చే అవకాశం ఉంది. మరి ఈ సినిమా తర్వాత ఆమె కెరియర్ ఎలాంటి మలుపులు తిరగబోతుందో వేచి చూడాలి.
ఇక పుష్ప 2 సినిమా సంగతి కి వస్తే.. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కావాల్సింది. కానీ ఇంకా సినిమా షూటింగ్ పెండింగ్లో ఉండటంతో సినిమా వాయిదా పడబోతుంది. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ సినిమా డిసెంబర్ లో ..విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter