Bigg Boss 6 Telugu Episode: బిగ్ బాస్ షోలో ఆరోవారం సాఫీగా సాగుతోంది. కెప్టెన్సీ టాస్కులు అంటూ అందరినీ ఏడిపించేశాడు. బ్యాటరీ రీచార్జ్ అంటూ అందరినీ ఏడిపించేశారు. బిగ్ బాస్ ఇంట్లోని సభ్యులకు వారి వారి ఫ్యామిలీ మెంబర్లతో మాట్లాడించాడు. వారిని చూపించాడు. ఇలా కొందరు గాల్లో తేలిపోయారు. ఇంకొందరు ఆనంద భాష్పాల్లో తడిసి ముద్దయ్యారు. మరికొందరికి ఎలాంటి అవకాశాలు రాకుండా పోయాయి. అయితే నిన్నటి ఎపిసోడ్లో మాత్రం గీతూ ఓవర్ యాక్షన్ చేసింది. మామూలుగా అయితే ప్రతీ రోజు గీతూ చేసేది ఓవర్ యాక్షనే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక నిన్నటి ఎపిసోడ్లోనూ గీతూ వ్యవహారం అంతే. తన టాపిక్ గురించి ఎవరైనా మాట్లాడితే, మధ్యలో వస్తే.. ఎందుకు వచ్చావ్ అని అంటుంది. మధ్యలో మాత్రం రావొద్దని అంటుంది. కానీ ఆమె మాత్రం అందరి మ్యాటర్లోకి వస్తుంది. మధ్యలోకి దూరుతుంది. గెలికి గెలికి నాశనం చేస్తుంది. గీతూకి ఏ కంటెస్టెంట్ అయినా నచ్చకపోతే ఇక అంతే.. వారి గురించి బ్యాడ్‌గానే చిత్రీకరిస్తుంది.


ఇప్పుడు సుదీప అంటే గీతూకి అంతగా నచ్చడం లేదు. దీంతో ఆమె గురించి ఫైమా దగ్గర గీతూ చెప్పుకొచ్చింది. నాకేమైనా తీటనా? అంటూ పదే పదే పిచ్చి పిచ్చి పదాలతో రెచ్చిపోయింది. బాలాదిత్య శ్రీ సత్య ఇష్యూలోనూ గీతూ మధ్యలోకి దూరింది. నీకు అర్థం చేసుకునేంత లేదు అంటూ.. అది రోహిత్‌కు కాస్త ఎక్కువగా ఉందంటూ శ్రీ సత్యను కెప్టెన్సీ టాస్కులోంచి పక్కన పెట్టేశాడు బాలాదిత్య.


ఆ విషయం మీద సత్య, బాలాదిత్య వాగ్వాదానికి దిగారు. సత్య ఏదో అంటోంది.. బాలాదిత్య ఇంకేదో చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే మధ్యలోకి దూరిన గీతూ.. అదొక సిల్లీ రీజన్ అంటూ సత్యకు పాయింట్ ఇచ్చింది. అవును అది సిల్లీ రీజన్ అని సత్య అనేసింది. దీంతో ఆదిత్యకు కాలిపోయింది. మధ్యలోకి నువ్వెందుకు వచ్చావ్.. రావడానికి నువ్ ఎవరు అంటూ ఫైర్ అయ్యాడు. నేను మధ్యలోకి వస్తాను అన్నట్టుగా మొండికేసింది గీతూ. 


 




ఇలా గీతూ చేస్తోన్న చేష్టలకు జనాలు తలలు పట్టుకుంటున్నారు. అయినా గీతూ మాత్రం ఎలిమినేట్ అయ్యే చాన్స్ అస్సలు కనిపించడం లేదు. బిగ్ బాస్ టీం ఆమెను చివరి వరకు ఉంచేలా కనిపిస్తోంది. చివరి వారం వరకు గీతూ ఉంటుంది. జనాలు ఎంత గగ్గోలు పెట్టినా కూడా ఆమెను బయటకు పంపించరు. ఎందుకంటే గీతూని తిడుతున్నా సరే.. షో మీద అయితే ఇంట్రెస్ట్‌గా చూస్తారు కదా? అని బిగ్ బాస్ టీం ఆలోచిస్తున్నట్టుంది. ఇప్పుడు టీఆర్పీ ఇవ్వాలంటే గీతూ లేదా రేవంత్ స్టఫ్ చూపించాల్సిందే అన్నట్టుగా మారింది.


Also Read : Harry Potter Actor Robbie Coltrane : హ్యారీ పోటర్ నటుడు మృతి


Also Read : Nayanthara Surrogacy : చిక్కుల్లో నయన్ విఘ్నేశ్.. ఆ లూప్ హోల్‌తో బయటపడే ప్లాన్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి