Gagavva Ghost Prank: బిగ్‌బాస్‌ హౌస్‌లోకి మరోసారి వెళ్లిన తెలంగాణ సోషల్‌ మీడియా స్టార్‌ గంగవ్వకు దయ్యం పట్టింది. అర్ధరాత్రి నెత్తి విరబోసుకుని కూర్చుని గావు కేకలు వేసింది. ఆమె అరుపులు కేకలు విన్న కంటెస్టెంట్లు ఉలిక్కి పడ్డారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు వెళ్తుండగా గంగవ్వ గర్జించింది. దీంతో అర్ధరాత్రి కంటెస్టెంట్లకు కారిపోయింది. గజగజ వణికిపోయారు. ఒక్కసారిగా బిగ్‌బాస్‌ షో ఉలిక్కిపడింది. గంగవ్వకు ఏం జరిగిందా? అని అందరిలో ఆందోళన మొదలైంది. దీనికి సంబంధించిన ప్రొమో ప్రేక్షకులను దిగ్భ్రాంతికి గురి చేసింది. అనంతరం జరిగినది ఏమిటో తెలుసుకుని అందరూ పగలబడి నవ్వుతున్నారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Bigg Boss Telugu 8: బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ పై కేసు ఫైల్.. అసలేం జరిగిందంటే..?


గంగవ్వతో వినోదం
బిగ్‌బాస్‌ షో 8వ సీజన్‌ ప్రారంభమై ఏడు వారాలు అవుతున్నా అంతగా ఆదరణ రాకపోవడంతో నిర్వాహకులు వినోదం డోస్‌ పెంచుతున్నారు. ఈ క్రమంలోనే గంగవ్వను సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా చేసుకున్న బిగ్‌బాస్‌ ఆమెతో వీలైనంత ఎక్కువ వినోదం పండించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ 52వ రోజు ఏం జరిగిందనే దానిపై ప్రొమో విడుదల చేశారు. ఈ ప్రొమోలో గంగవ్వ అందరినీ భయపెట్టేసింది. అర్ధరాత్రి మేల్కొన్న కంటెస్టెంట్లు భయభ్రాంతులకు గురయ్యారు.

Also Read: Burugapally Siva Rama Krishna: టాలీవుడ్ నిర్మాత అరెస్ట్.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు..!


వైల్డ్ కార్డు ఎంట్రీతో హంగామా
వైల్డ్‌ కార్డు ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాశ్‌, టేస్టీ తేజ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ చెప్పాడో లేదా వారి సొంత నిర్ణయమో తెలియదు కానీ గంగవ్వతో దయ్యం డ్రామా ఆడించారు. దెయ్యంగా నటించి బిగ్‌బాస్‌ హౌస్‌ను భయపెట్టాలని అవినాశ్, తేజ చెప్పడంతో దానికి అంగీకరించిన గంగవ్వ వారు చెప్పినట్టు చేసింది. అర్ధరాత్రి లేచి జుట్టు విరబోసుకుని గంగవ్వ సోఫాల వద్ద బల్లపై కూర్చుంది.


అర్ధరాత్రి కలకలం
అరుపులు.. కేకలతో రెచ్చిపోవడంతో కంటెస్టెంట్ల అందరూ భయపడి లేచారు. అర్ధరాత్రి గంగవ్వకు ఏం జరిగిందోనని భయాందోళన చెందారు. దగ్గరకు వెళ్లిన అవినాశ్‌, టేస్టీ తేజపై ఆమె కన్నెర్ర చేసి భయపెట్టారు. అసలు గంగవ్వకు ఏం జరిగింది? ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందోనని రోహిణి, విష్ణుప్రియతోపాటు పృథ్వీరాజ్‌, నిఖిల్‌ తదితరులు చర్చించుకున్నారు. గంగవ్వను శాంతపర్చేందుకు ప్రయత్నించారు. ఆమెకు వైద్య సహాయం కావాలని మరో కంటెస్టెంట్‌ బిగ్‌బాస్‌ను విజ్ఞప్తి చేశారు. వెంటనే బిగ్‌బాస్‌ స్పందించి గంగవ్వకు ఏమైనా చేయాలని కోరారు. గంగవ్వను శాంతపర్చిన టేస్టీ తేజ ఆమెను నిద్రపుచ్చారు. ఆ తర్వాత కంటెస్టెంట్ల అంతా ఈ ప్రాంక్‌తో భయపడిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నిజంగంటే *చ్చ పడిపోయిందని కొందరు కంటెస్టెంట్లు అన్నారు.

నామినేషన్లకు ఇదే
ఈ ప్రాంక్‌ వీడియో విజయవంతం కావడంతో అవినాశ్, టేస్టీ తేజ పగలబడి నవ్వారు. కాగా ఇదే ప్రాంక్‌ అవినాశ్, తేజ, గంగవ్వలపై వచ్చే సోమవారం నామినేషన్లు పడే అవకాశం ఉంది. అయితే గంగవ్వకు గుండెపోటు అని జరిగిన ప్రచారం వెనుక ఈ ప్రాంక్‌ ఉండి ఉంటుందని తెలుస్తోంది.






స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter