Shree Rapaka shocking comments About Hero Prabhas Wedding: భారతీయ చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఎవరంటే.. టక్కున గుర్తొచ్చేది ఇద్దరే ఇద్దరు. ఒకరు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కాగా.. మరొకరు టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌. పెళ్లెప్పుడని 56 ఏళ్ల సల్లు భాయ్‌ని అడిగి అడిగి ప్రతి ఒక్కరు విసిగిపోయారు. ఇటీవలి కాలంలో ఆయన పెళ్లి విషయంపై ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ప్రస్తుతం 42 ఏళ్ల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ పెళ్లి ఇప్పుడా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రభాస్‌ పెళ్లి అంశం ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ పెద్ద హాట్‌ టాపిక్‌ అయింది. డార్లింగ్‌ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడా అని ఆయన ఫాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక లేడీ ఫాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్‌ ఒప్పుకుంటే.. తాను పెళ్లికి రెడీ అంటూ ఎంతో మంది ఇప్పటికే చెప్పారు. అయితే ప్రభాస్‌ పెళ్లి చేసుకునేంతవరకు తాను కూడా చేసుకోనని బిగ్‌బాస్‌ బ్యూటీ శ్రీ రాపాక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 


బిగ్‌బాస్‌ ఓటీటీలో సందడి చేసిన శ్రీ రాపాక.. రెండోవారమే ఎలిమినేట్‌ అయి బయటకు వచ్చేశారు. అప్పటి నుంచి వరస ఇంటర్య్వూలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ప్రభాస్‌ పెళ్లిపై స్పందించారు. ప్రభాస్‌ నటించిన ఈశ్వర్‌ మూవీ అంటే చాలా ఇష్టమని, అప్పటి నుంచి రెబల్ స్టార్ అంటే క్రష్‌ అని హాట్ బ్యూటీ తెలిపారు. ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటారని అడగ్గా.. అంతకంటే అదృష్టమా అని సమాధానం ఇచ్చారు. ప్రుభాస్‌ను పెళ్లి చేసుకుని ఒక్కరోజు జీవించిన చాలంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. 


ప్రుభాస్‌ను పెళ్లి చేసుకోవడం ఎలాగు అది జరగదు కాబట్టి.. ఆయన పెళ్లి చేసుకునేంత వరకు వెయిట్‌ చేస్తానని శ్రీ రాపాక అన్నారు.  ప్రుభాస్‌ పెళ్లి తర్వాతే తాను పెళ్లి పీటలు ఎక్కుతానని కుండబద్దలు కొట్టారు. ఒకవేళ ప్రుభాస్‌ పెళ్లి చేసుకోకపోతే.. తాను కూడా ఎప్పటికీ చేసుకోనని చెప్పారు. ఆర్జీవీ 'నగ్నం' మూవీతో శ్రీ రాపాక హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. శ్రీ రాపాక హీరోయిన్‌ కంటే ముందు పలు సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా చేశారు. 


Also Read: Governor Tamilisai: నాపై తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపిస్తోంది: గవర్నర్ తమిళిసై


Also Read: HDFC merge: హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​-హెచ్​డీఎఫ్​సీ విలీనంతో వచ్చే భారీ మార్పులు ఇవే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook