Pallavi Prasanth Arrested: బిగ్‌బాస్‌ సీజన్ సెవెన్ విన్నర్‌, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌కు చాలా పెద్ద షాక్ తగిలింది. ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు ప్రశాంత్‌ను.. అలానే ఆయన తమ్ముడిని అరెస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లా కొల్గూరులో పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేసిన అనంతరం పోలీసులు జూబ్లీ హిల్స్ పీఎస్‌కు స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గజ్వేల్ మండలం కొల్లూర్ గ్రామంలోని తన ఇంటి వద్ద పల్లవి ప్రశాంత్ ని అదుపులోకి తీసుకున్నారు. బిగ్ బాస్ ఫైనల్ అనంతరం జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియో దగ్గర జరిగిన రచ్చ.. వాహనాల ధ్వంసం పై పోలీసులు పల్లవి ప్రశాంత్ పైన పోలీసులు ఇతడిపై 9 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక ప్రశాంత్ ని  అతడి తమ్ముడు మహవీర్ ని జూబ్లీ హిల్స్ పోలీసులు అదుపులో తీసుకొని జూబ్లీ హిల్స్ పోలిస్ స్టేషన్ కు తరలించినట్లు సమాచారం.


టైటిల్ విన్నర్ ప్రకటన తర్వాత పల్లవి ప్రశాంత్ అభిమానులు అమర్ దీప్ పైన అలానే ఇతర కంటెస్టెంట్ల పైన దాడులకు దిగారు. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ బస్సులపై కూడా తమ ప్రతాపాన్ని చూపించారు. ఈ దాడిలో దాదాపు 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ఈ కేసు పైన ఈరోజు పల్లవి ప్రశాంత్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.


కాగా గజ్వేల్ మండలం కొల్లూర్ గ్రామంలోని అతడి ఇంటి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అతని ఇంటి వద్ద కాసేపు వాగ్వాదం జరిగింది. తాను ఎలాంటి గొడవ చేయనని, పోలీసులకు సహకరిస్తానని ప్రశాంత్ చెప్పారు. ఇక ఈ ఘటనలో ప్రశాంత్ సహా ఐదుగురిపై కేసు నమోదైంది.


Also read: CM Revanth Reddy Tour: ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, మోదీని కలిసే అవకాశం, త్వరలో కేబినెట్ విస్తరణ


Also read: SRH New Captain: ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ మార్పు ? అందుకే అతడిని అంత ధరకు కొనుగోలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook