Bigg Boss 7 Telugu Elimination: రోజురోజూకు బిగ్ బాస్ సీజన్ 07 రసవత్తరంగా సాగుతోంది. ఊహించని ట్విస్ట్ లతో బిగ్ బాస్ షో ను రక్తికట్టిస్తున్నారు నిర్వాహకులు. ఈ సీజన్ ప్రారంభంలోనే అంతా ఉల్టా పల్టా అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేయడంతో కంటెస్టెంట్లు అందరిలోనూ ఎలిమినేషన్ భయం పట్టుకుంది. దీంతో అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెుదటి వారం హౌస్ నుంచి కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ కాగా.. ఈ వారం ఎవరూ ఎలిమినేట్ అవుతారోనని ఆడియన్స్ క్యూరియాసిటీ నెలకొని ఉంది. ఎందుకంటే ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ హీటెక్కింది. ప్రశాంత్, అమర్ దీప్ వాదనలకు టీఆర్పీ రేటింగ్ దూసుకుపోయింది. 18.1 టీవీఆర్ వచ్చినట్లు స్వయంగా స్టార్ మా వెల్లడించింది.  ఈ వారం నామినేషన్స్ లో 9 మంది ఉన్నారు. ఇందులో పల్లవి ప్రశాంత్, శివాజీ, షకీలా, శోభాశెట్టి, టేస్టీ తేజా, రతిక, ప్రిన్స్ యావర్, అమర్ దీప్ చౌదరి, గౌతమ్ కృష్ణ ఉన్నారు. ఓటింగ్ లో పల్లవి ప్రశాంత్ ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. ఆ తర్వాత స్థానాల్లో అమర్ దీప్, శివాజీ ఉన్నారు. చివరి స్థానాల్లో షకీలా, టేస్టీ తేజా ఉన్నారు. 


అయితే ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఉల్టా పల్టాగా సాగుతోందని తెలుస్తోంది. ఈ వారం ముగ్గురు హౌస్ నుంచి బయటకు వెళ్లే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఇద్దరినీ ఎలిమినేట్ చేసి.. ఒకరిని సీక్రెట్ రూమ్ లోకి పంపుతారనే ప్రచారం కూడా సాగుతోంది. ఓట్లు అత్యధికంగా వచ్చిన ప్రశాంత్ ను ఎలిమినేట్ చేసి అతడిని సీక్రెట్ రూమ్ లో ఉంచాలని బిగ్ బాస్ టీమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వారం ఎవరకు బయటకు వెళ్తారో, ఎవరు సీక్రెట్ రూమ్ కు వెళ్తారో వేచి చూడాలి. 


Also Read: Anand Deverakonda: ఆనంద్ దేవ‌ర‌కొండ 'గం గం గ‌ణేషా' టీజ‌ర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook