Bigg Boss 7 Telugu Contestants Remuneration Viral: బుల్లితెర బిగ్గెస్ట్‌ రియాలిటీ షో బిగ్‌బాస్‌ సీజన్‌ 7(Bigg Boss Telugu Season 7) రీసెంట్ గా ప్రారంభమైంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహారిస్తున్న ఈ షో లో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు హౌజ్‌లోకి వెళ్లారు. ఇప్పటికే మెుదటి రోజు కూడా పూర్తయింది. అంతేకాకుండా ఈ వారం నామినేషన్స్, తిట్టుకోవడాలు, లవ్ ట్రాక్ లు అప్పడే మెుదలయ్యాయి. వీకెండ్‌లో మరికొంతమంది కంటెస్టెంట్లు హౌజ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. తాజాగా ఈ ఏడో సీజన్‌ కంటెస్టెంట్ల రెమ్యునరేషన్లకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాప్ రెమ్యూనరేషన్ తీసుకునే కంటెస్టెంట్ ఎవరో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌లో తొలి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ప్రముఖ సీరియల్‌ నటి ప్రియాంక జైన్‌ వారానికి రూ. 2.5 లక్షల పారితోషకం ఛార్జ్ చేస్తోందట. సింగర్ దామినీ భట్ల, హీరోయిన్‌ రతికాకు రూ. 2లక్షలు రెమ్యూనరేషన్ ఇవ్వనున్నారట మేకర్స్. మరోవైపు కార్తీక దీపం ఫేమ్ శోభాశెట్టికి వారానికి రూ. 2.5 లక్షలు తీసుకుంటున్నారట. నటి లాయర్ శుభశ్రీకి రూ. 2 లక్షలు, నటుడు గౌతమ్‌ కృష్ణకు రూ. 1.75 లక్షలు, మోడల్‌ ప్రిన్స్‌ యావర్‌కు రూ. 1.5 లక్షలు ఆఫర్ చేశారట. 


Also Read: Tovino Thomas injured: షూటింగ్‌లో గాయపడ్డ మలయాళ స్టార్‌ హీరో


ప్రముఖ కొరియోగ్రాఫర్‌ ఆట సందీప్‌కు వారానికి రూ.2.75 లక్షలు, సీరియల్ నటుడు అమర్‌దీప్‌కు రూ. 2. 5 లక్షలు, నటుడు టేస్టీ తేజాకు రూ.1.5 లక్షలు పారితోషికం అందనుందట. సీనియర్ నటీమణులు షకీలా రూ. 3.5 లక్షలు, కిరణ్‌ రాథోడ్‌ రూ. 3 లక్షలు తీసుకుంటున్నారని టాక్. ఇక అందరికంటే ఎక్కువగా సీనియర్ నటుడు శివాజీ వారానికి రూ.4 లక్షలు ఛార్జ్ చేస్తున్నారంట. అతి తక్కువగా రైతు పల్లవి ప్రశాంత్ వారానికి రూ. లక్ష తీసుకుంటున్నాడట. 


Also read: Miss Shetty MR Polishetty: 'మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి' మూవీపై చిరంజీవి రివ్యూ.. జాతిరత్నాలకు మించి కామెడీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook