Bigg Boss Season 7 Telugu Latest Updates: బిగ్‌బాస్‌ సీజన్ 7 ట్విస్టులతో నడుస్తోంది. ఉల్టా పుల్టా అనే క్యాప్షన్‌కు తగినట్లే ఆడియన్స్‌ను థ్రిల్‌కు గురిచేస్తోంది. మంగళవారం హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్ బిగ్ ట్విస్టే ఇచ్చాడు. హౌస్‌లో గొడవలు పెట్టేందుకు పెద్ద ప్లానే వేశాడు. మూడో పవర్ అస్త్ర దక్కించుకుంనేందుకు ముగ్గురు హౌస్‌మేట్స్‌ను ఎంపిక చేశాడు. అమర్ దీప్, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్‌ల పేర్లను ప్రకటించి.. ఎంపిక చేయని కంటెస్టెంట్లను ఒక్కొక్కరిని రూమ్‌లోకి పిలిచాడు. ముగ్గురు కంటెండర్లలో ఎవరు అనర్హులో చెప్పాలని సూచించాడు బిగ్‌బాగ్. కన్ఫెషన్ రూమ్ కదా అనుకుని కంటెస్టెంట్లు ముగ్గురు పేర్లలో తమకు నచ్చని వారి గురించి నెగిటివ్స్ అన్నీ చెప్పేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే సాయంత్రానికి బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు పెద్ద షాకిచ్చాడు. కన్ఫెషన్ రూమ్‌లో వాళ్లు చెప్పిదంతా.. టీవీలో ప్లే చేశాడు. దీంతో ముగ్గురు కంటెండర్ల ముందు మిగిలిన వారి అసలు స్వరూపం బయటపడిపోయింది. ముందుగా ప్రిన్స్ యావర్‌ని కంటెండర్‌గా అనర్హులని చెప్పిన వారిలో టెస్టీ తేజ ముందుగా మాట్లాడుతూ.. యావర్ హౌస్‌మెట్‌గా సరికాదన్నాడు. ఇంటి పనులు సరిగా చేయడని అంటూ రీజన్ చెప్పాడు. దామిని మాట్లాడుతూ.. ప్రిన్స్‌కు అందరితో సరిగా కనెక్షన్‌ లేదని చెప్పుకొచ్చింది. తెలుగు రాదంటూ మళ్లీ పాత స్టోరీనే కారణంగా చెప్పింది.  


ఆ తరువాతే అసలు ట్విస్ట్ బయటపడింది. ప్రిన్స్‌ యావర్‌తో క్లోజ్‌గా ఉండే రతిక రోజ్ కూడా షాక్ ఇచ్చింది. యావర్ అనర్హుడంటూ చెప్పింది. అతడికి కొంచెం షార్ట్ టెంపర్ ఎక్కువగా ఉందని.. హౌస్‌లో అది పనికి రాదని పేర్కొంది. ఫిజికల్ టాస్క్‌ల్లో యావర్ బాగా ఆడొచ్చొమో గానీ.. హౌస్‌మెట్‌గా మాత్రం పనికిరాడంటూ కుండబద్దలు కొట్టింది. ఈ వీడియో చూసి ప్రిన్స్ యావర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఏం చెప్పాలో అర్థం కాక.. రెండు చేతులు చేబులలో పెట్టుకుని లేచి బయటకు వెళ్లిపోయాడు. 


అక్కడికి టేస్టీ తేజ వచ్చి తన కారణం గురించి చెప్పబోయాడు. బ్రో నేను చెప్పింది నీకు అర్థం అయిందా..? అని యావర్‌ను తేజ అడగ్గా.. కనెక్ట్‌ కాలేదని ఆన్సర్ ఇచ్చాడు. ఇంటి పనులు చేయలేదంటే.. నేను ఏమైనా నీ పెళ్లాన్నా..? నీ బట్టలు ఉతకాలా..? అంటూ యావర్ ఫైర్ అయ్యాడు. నీ ఓపియన్ నువ్వు చెప్పావు కదా.. ఒకే వెళ్లి పో అన్నాడు. తనలో తాను మాట్లాడుకుంటూ.. రతిక కూడా దెబ్బేసింది అంటూ ఊగిపోయాడు. ఛీఛీ అనుకుంటూ తలపట్టుకున్న యావర్.. సిగరేట్ తాగుతూ సీరియస్‌గా కనిపించాడు. అక్కడే గ్లాస్ టీపాయిని గుద్దడంతో ఏమైందని ఇతర కంటెస్టెంట్లు వచ్చి అడిగారు. రతిక మాత్రం నా అభిప్రాయం నాదంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. 


Also Read: Janasena Glass Symbol: జనసేనకు గుడ్‌న్యూస్.. గాజు గ్లాస్ గుర్తు వచ్చేసింది  


Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడంటే..?  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook