Bigg Boss Season 7 Updates: నెదర్లాండ్స్‌లో బిగ్ బ్రదర్ పేరిట మొదటగా బిగ్ బాస్ షో ప్రారంభమైంది. మన ఇండియాలో మొదటగా హిందీ లో ప్రారంభమై.. తరువాత దక్షణాదిన భాషల్లో మంచి మార్కులు కొట్టేసింది ఈ రియాలిటీ షో. మొదట్లో ఈ షో కాస్త నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిన ఆ తరువాత ఏ రేంజ్ లో వెళ్లిందో మన అందరికీ తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మన తెలుగులో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సెప్టెంబర్ 3 న ప్రారంభమైన సంగతి తెలిసిందే! 'ఉల్టా ఫుల్టా' పేరుతో కంటెస్టెంట్ ల మధ్య జరిగే సంఘటనల మధ్య రసవత్తరంగా సాగుతుంది. నిన్న ఆదివారం నాగార్జున జరిగిన ఎపిసోడ్ లో కొత్తగా కంటెస్టెంట్ లు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు. ఇక నుండి మరింత ఆసక్తిగా జరగనున్నట్లు సమాచారం. 


అసలు విషయానికి వస్తే.. తమిళ్ బిగ్ బాస్ బిగ్ బాస్ తమిళ్ సీజన్ 7 వారం క్రిందటే ప్రారంభం అయింది. తమిళ్ బిగ్ బాస్ లో కూడా మంచి కంటెస్టెంట్ లనే తీసుకువచ్చారు. ఇక్కడ నాగార్జున గారు హోస్ట్ చేస్తుంటే.. తమిళంలో కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్నారు. 


కానీ.. బిగ్ బాస్ తమిళ్ సీజన్ 7 బావ చెల్లదురై కంటెస్టెంట్ గా వచ్చారు. ఆయన వయసు మీద పడినప్పటికీ తోచిన విధంగా కిచెన్ లో అక్కడిక్కడే పనులు చేస్తున్నాడు. ఫిజికల్ టాస్క్ లో బావ చెల్లదురై యాక్టివ్ గా లేని కారణంగా హౌస్ నుండి వెళ్లిపోయే లిస్ట్ లో.. నామినేట్ చేశారు. కానీ బావ చెల్లదురై అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి అని.. బిగ్ బాస్ కు విన్నవించుకున్నాడు. 


Also Read: Chandrababu Case Updates: చంద్రబాబుకు మరో షాక్, బెయిల్ పిటీషన్ కొట్టివేసిన కోర్టు


"ఒకసారి బయటకి వెళ్తే మళ్లీ తిరిగి రాలేరు అని.. బయటకి వెళ్లే ముందు మరిఒకసారి ఆలోచించండి అని" సూచించారు బిగ్ బాస్. కానీ బావ చెల్లదురై.. తన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని.. ఆరోగ్యం సహాకరించటం లేదు అన్న మాట పైన బిగ్ బాస్ తనను బయటకి పంపించేశారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింలో వైరల్ గా మారింది. 


ఇక మన తెలుగు బిగ్ బాస్ సీజన్ విషయానికి వస్తే.. ఫస్ట్ సీజన్ లో సంపూర్ణేష్ బాబు మొదట్లో కాస్త ఎంటర్టైన్ చేసిన కొద్దీ రోజులకే వెళ్లిపోతానని మారం చేస్తే డబ్బులు కట్టాలని చెప్తే చెప్పిన కండిషన్ కి సరే అన్నందుకు సంపూ బయటకి వచ్చేసారు. 


Also Read: TTD News: తీపికబురు అందించిన టీటీడీ.. వారికి జీతాలు పెంపు  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి