Bigg Boss Shrihan - Awara Zindagi : బిగ్ బాస్ షోతో శ్రీహాన్‌కు ఇప్పుడు మంచి క్రేజ్ ఏర్పడింది.  ఈ క్రమంలోనే అతని కొత్త సినిమాను ప్రమోట్ చేసేందుకు మేకర్లు ముందుకు వచ్చారు. ఈ సినిమాలో అవినాష్ తమ్ముడు అజయ్ కూడా నటించాడు. వీరి పాత్రలకు సంబంధించిన పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు.  ఫన్ ఓరియెంటెడ్ మూవీగా ఓ యూత్ ఫుల్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఆవారా జిందగి మూవీ. నేటితరం ఆడియన్స్ మెచ్చే కథ ఎంచుకొని దానికి కావాల్సినంత ఫన్ యాడ్ చేస్తూ థియేటర్స్ లో మజా చేసేందుకు సిద్ధమవుతోంది ఆవారా జిందగి టీమ్. గతంలో వచ్చి సూపర్ సక్సెస్ సాధించిన ఫన్ కాన్సెప్ట్ జాబితాలో తమ సినిమా కూడా నిలిచేలా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమా రూపొందించారు దర్శకనిర్మాతలు.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫన్ ఫిల్డ్ ఎంటర్ టైనర్ మూవీగా రాబోతున్న ఈ ఆవారా జిందగి చిత్రానికి  దేప శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. విభా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు నిర్మాత నంద్యాల మధుసూదన్ రెడ్డి. ఈ చిత్రానికి కంభంపాటి విజయ్ కుమార్ సహ నిర్మాతగా వ్యవహరించగా.. ప్రతీక్ నాగ్ సంగీతం అందించారు. ఖర్చుకు ఎక్కడా వెనక్కి తగ్గకుండా సినిమా హై క్వాలిటీలో రూపొందిస్తున్న ఈ సినిమా నుంచి ఒక్కో అప్‌డేట్ వదులుతూ ఆసక్తి పెంచుతున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు. 


విడుదల చేసిన కాసేపట్లోనే ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకుంది ఈ ఆవారా జిందగి ఫస్ట్ లుక్ పోస్టర్. సినిమా కథను రిప్రెజెంట్ చేసేలా నలుగురు కుర్రాళ్లతో ఈ పోస్టర్ డిజైన్ చేశారు. పోస్టర్ లో కనిపిస్తున్న చార్మినార్, పిస్తోల్, 2000 రూపాయల నోట్లు అలాగే ఆ నలుగురి లుక్స్ ఈ సినిమాలో వైవిధ్యం ఉండనుందని స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఆ నలుగురి ఆవారా పనులు ఎలా ఉండబోతున్నాయి? ఆ పనులకు కామెడీ ఎలా లింక్ చేశారు? తమ క్యారెక్టర్స్‌తో ఈ ఆవారా కుర్రోళ్ళు ప్రేక్షకులను ఎలా ఎంటర్‌టైన్ చేస్తారు అనేది థియేటర్స్ లో చూద్దాం. 


 బిగ్ బాస్ శ్రీహాన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ ఆవారా జిందగి సినిమాను ఆడియన్స్ కోరుకునే విధంగా కామెడీ ప్రధానాంశంగా తెరకెక్కించారు. నలుగురు కుర్రోళ్ళ నడుమ నడిచే ఫుల్ లెంగ్త్ కామెడీతో ఈ సినిమాను గ్రాండ్ గా రూపొందిస్తున్నారు. జీరో లాజిక్ 100% ఫన్ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా రానుండటం ఆసక్తికర అంశం. అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించేలా ఈ సినిమా కథ ఎంచుకొని ఇంట్రెస్టింగ్ లొకేషన్స్ లో తెరకెక్కించారు మేకర్స్. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.


చిత్రంలో బిగ్ బాస్ శ్రీహాన్, ముక్కు అజయ్, ఢీ చెర్రీ, జస్వంత్, షియాజీ షిండే, సద్దాం, టార్జాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. చిత్రానికి శ్యామ్ ప్రసాద్ V, ఉరుకుంద రెడ్డి S సినిమాటోగ్రాఫర్స్ గా పని చేయగా.. S B రాజు తలారి ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. అతిత్వరలో ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించనున్నారు.  


Also Read : Chiranjeevi - pawan kalyan : పవన్ కళ్యాణ్‌కు మద్దతిస్తానేమో?.. చిరు మాటలు ఆంతర్యమిదే


Also Read : Ganesh Bellamkonda : తెర వెనుక అలవాటే అంటోన్న బెల్లంకొండ హీరో


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook