Suhas: కన్నీళ్లు కాదు.. కథ ముఖ్యం.. ఇద్దరు యంగ్ హీరోల మధ్య తేడా ఇదే
Ambajipeta Marriage Band: సినీ ఇండస్ట్రీలో ప్రతిరోజు ఎంతోమంది తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలి అని ఉద్దేశంతో అడుగుపెడుతూ ఉంటారు. ఈ రంగుల ప్రపంచంలో కొందరు క్లిక్ అయితే మరికొందరికి లక్ అచ్చిరాక ఇబ్బంది పడుతుంటారు. రీసెంట్ గా సోహల్ పరిస్థితి కూడా ఇలాగే తయారయింది.
Bigg Boss Sohel: ఈ సినీ రంగుల ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం ఎవరికైనా కష్టమే. మరి ముఖ్యంగా ఫేమ్ ఎప్పుడు ఎవరి దగ్గర ఉంటుందో.. లక్ ఎప్పుడు ఎవరిని వరిస్తుందో అస్సలు అర్థం కాదు. ఈ ఇండస్ట్రీ లో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి వండర్స్ సృష్టించిన వారు ఉన్నారు.. పెద్దపెద్ద బ్యాగ్రౌండ్ లో ఉన్న సక్సెస్ అందుకోలేని వారు ఉన్నారు. సంక్రాంతి సందడి ముగిసి.. సమ్మర్ హడావిడి షురూ కావడానికి ఈ మధ్య గ్యాప్ లో చిన్న సినిమాలు సందడి చేయడానికి థియేటర్లలోకి వచ్చాయి.
అరడజనుకు పైగా విడుదలైన సినిమాలలో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా మాత్రం మాంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలతో పాటు బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ సోహెల్..‘బూట్ కట్ బాలరాజు’కూడా విడుదల అయింది. అయితే ఈ చిత్రం మాత్రం బాక్సాఫీస్ వద్ద చాలా వీక్ పెర్ఫార్మెన్స్ కనబరుస్తోంది. థియేటర్ ఆక్యుఫెన్సీ లేదు.. కలెక్షన్స్ లేవు.. దీంతో రిలీజ్ అయిన రోజు షో ముగిసాక హీరో సోహెల్ థియేటర్ బయట తన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అతను చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవున్నాయి.
తన సినిమాని చూడండి అంటూ పేరుపేరునా ప్రాంతం ప్రాంతం మెన్షన్ చేస్తూ అతను గగ్గోలు పెట్టాడు. బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు సోహెల్..సోహెల్..అని కామెంట్లు పెట్టారు కదా అన్నా..? మరి ఇప్పుడు నా సినిమాలు ఎందుకు చూడడం లేదు.. నా సినిమా కంటెంట్ డీసెంట్ గా ఉంటుంది.. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే విధంగా ఉంటుంది.. మరి అలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినా నా బూట్ కట్ బాలరాజు సినిమాని ఎందుకు చూడడం లేదు.. అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
సోహెల్ చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియాలో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. కొందరు అతనిపై సింపతి చూపిస్తుంటే మరి కొందరు మాత్రం అసలు హీరోగా సినిమాలు చేయమని ఎవరు అడిగారు? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది కరెక్ట్ కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తే ఎవరైనా ఎందుకు చూడరు అని కామెంట్లు పెడుతున్నారు. బిగ్ బాస్ లో రాక ముందు కూడా సోహల్ కొన్ని సినిమాల్లో నటించాడు. కొత్త బంగారులోకం ,కెమెరామెన్ గంగతో రాంబాబు ,సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ,జనతా గ్యారేజ్…ఇలా మంచి సూపర్ డూపర్ హిట్ సినిమాలలో అతడు యాక్ట్ చేశాడు.
అయితే అందులో అతను చేసిన పాత్రలన్నీ చాలా చిన్నవి .. పెద్దగా గుర్తింపు లేనివి. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా మారిన తర్వాత ఒక్కసారిగా వచ్చిన ఫేమ్ నిజమని నమ్మి ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద అడ్డంగా బుక్ అయిపోయాడు. ఈ నేపథ్యంలో అతనిని మరో హీరో సుహాస్ తో తెగ పోలుస్తున్నారు నెటిజన్స్. హీరో అంటే ఎత్తు, అందం, అభినయంతో పాటు డాన్సులు, ఫైట్లు చేసే సత్తా ఉండాలి. ఇవన్నీ ఆలోచించుకున్న సుహాస్ యూట్యూబ్ కంటెంట్ తో సూపర్ క్రేజ్ సొంతం చేసుకొని మెల్లిగా వెరైటీ కంటెంట్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. నా సినిమా చూడండి అని ఏడ్చే పరిస్థితి రాకుండా జాగ్రత్తలు పడుతున్నాడు. ఇప్పటికైనా సోహెల్..సుహాసిని చూసి నేర్చుకుంటే మంచిది అని సలహా ఇస్తున్నారు.
Also read: Tirumala Tirupati Devasthanam: ఈ నెల తిరుమల వెళ్లేవారికి బిగ్అలర్ట్.. టీటీడీ కీలక ప్రకటన..!
Also read: Budh Gochar 2024: మరో ౩ రోజుల్లో ఈ రాశికి బ్యాడ్ టైం స్టార్ట్.. ఇందులో మీ రాశి ఉందా? చెక్ చేయండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook