Singer Revanth Blessed With baby Girl : బిగ్ బాస్ ఇంట్లో వాళ్లకి బయటి సంగతులేమీ తెలియవు. తమ ఫ్యామిలీ మెంబర్లకు ఎలా ఉందా? అనే టెన్షన్‌తో కంటెస్టెంట్లు ఆటలు ఆడుతుంటారు. కొందరు తల్లిదండ్రుల గురించి బాధపడుతుంటే.. కొందరు తమ పిల్లలు, భార్య గురించి ఆలోచిస్తుంటారు. ఇప్పుడు ఈ ఆరో సీజన్‌లో సింగర్ రేవంత్ మాత్రం మొదటి నుంచి తన భార్య గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. తన భార్య గర్భంతో ఉండటం, శ్రీమంతం, డెలివరీ వంటి సందర్భాల్లో తాను పక్కన ఉండలేకపోతోన్నాను అని బాధపడుతుంటాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలా రేవంత్‌ బాధపడకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్ ఇస్తూనే వచ్చాడు. రేవంత్ భార్య అన్వితకు సంబంధించిన శ్రీమంతం ఫోటోలను, వీడియోలను ప్లే చేసి చూపించాడు. ఇప్పుడు రేవంత్‌కు పండంటి బిడ్డ పుట్టించింది. ఈ విషయం బిగ్ బాస్ ఇంట్లో ఉన్న రేవంత్‌కు తెలియదు. దీంతో బిగ్ బాస్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఆ ఎపిసోడ్‌ను నేడు ఆడియెన్స్‌కు చూపించబోతోన్నాడు. కన్ ఫెషన్ రూంకు పిలిపిచి రేవంత్‌కు అసలు విషయాన్ని చెప్పాడు బిగ్ బాస్.


 



పదకొండు గంటల 51 నిమిషాలకు మీకు పండంటి బిడ్డ పుట్టిందని బిగ్ బాస్ చెప్పడంతో రేవంత్ ఎమోషనల్ అయ్యాడు. ఇక ఇంతే కాకుండా తన పాపను కూడా చూపించాడు. పాపను, భార్యను చూసి రేవంత్ ఎమోషనల్ అయ్యాడు. ఇక ఇది చాలు బిగ్ బాస్ అంటూ చెప్పేశాడు. జూనియర్ రేవంత్ పుట్టిందని చెప్పు అంటూ తన బిడ్డను చూసుకుంటూ భార్యతో మాట్లాడాడు. ఇలా వీడియో కాల్ చేయడంతో రేవంత్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.


ఈ ప్రోమోను చూస్తే అందరికీ కళ్లు చెమ్మగిల్లిపోతోన్నాయి. ఇక ఎపిసోడ్‌లో రేవంత్ తన పాపను చూస్తూ పాట పాడిన తీరుతో అందరికీ గుండెలు పిండేసినట్టు అవుతోంది.మొత్తానికి ఈ పదమూడో వారంలో ఫైమా ఎలిమినేట్ అవుతందనే ప్రచారం ఎక్కువగా సాగుతోంది.


Also Read : Ariana Viviana Birthday : మంచు విష్ణు కూతుళ్ల బర్త్ డే.. అరియానా, వివియానా పిక్స్ వైరల్


Also Read : Rajamouli Correct jr NTR : అదొక్కటే తప్పుగా మాట్లాడావ్ తారక్.. రాజమౌళి ట్వీట్ వైరల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook