రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు 4 (Bigg Boss Telugu 4) హౌస్ నుంచి ఆరో వారం కంటెస్టెంట్ కుమార్ సాయి ఎలిమినేట్ అయ్యాడు. బిగ్‌బాస్ 4 ప్రేక్షకులు ఇంకా ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అంతలోనే బిగ్‌బాస్ తెలుగు 4లో 7వ వారానికి నామినేషన్ ప్రక్రియ (Bigg Boss 4 Telugu 7th Week Eliminnation Process Begin) సోమవారం జరిగింది. ఈ వారం ఇంటి నుంచి బయటకు పంపేందుకు ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. జంటలను బిగ్‌బాస్ ప్రకటించి, రంగు పడుద్ది అంటూ నామినేషన్ ప్రక్రియ నిర్వహించారు.  Gallery :  Bigg Boss 4: అరియానా గ్లోరి ఫొటోలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్ (Bigg Boss 4 Telugu) హౌస్ నుంచి ఇంటికి పంపడానికి నిర్వహించిన నామినేషన్ ప్రక్రియలో మొత్తం ఆరుగురు నామినేట్ అయ్యారు. నోయల్, మొనాల్ గజ్జర్, అభిజిత్, అరియానా గ్లోరి, అవినాష్, దివి ఈ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్. అయితే మీ ఫెవరెట్ కంటెస్టెంట్స్ బిగ్‌బాస్ 4 హౌస్ నుంచి బయటకు రావొద్దంటే మీ చేతుల్లోనే ఉంది. 



 


బిగ్‌బాస్ 4 హౌస్‌లో 7వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ ఓటింగ్ నెంబర్స్ ఇవే.. (Bigg Boss 4 Telugu: 7th Week Nominated Contestants Voting Numbers)
అరియానా - 8886658210
నోయల్ - 8886658213
అభిజిత్ - 8886658204
దివి - 8886658214
అవినాష్ - 8886658218
మొనాల్ - 8886658201


 


రెండు రకాలుగా (మిస్డ్ కాల్ ద్వారా ఓటింగ్, హాట్‌స్టార్‌లో ఆన్‌లైన్ ఓటింగ్) ఓటింగ్ వేసి మీ అభిమాన బిగ్‌బాస్ తెలుగు 4 కంటెస్టెంట్స్‌ను ఎలిమినేషన్ సేవ్ చేయవచ్చు.. 


మిస్డ్ కాల్ ద్వారా ఓటింగ్... (Bigg Boss 4 Telugu Voting Missed Call Numbers)
మీ ఫెవరెట్ కంటెస్టెంట్ అరియానా అయితే 8886658210కు మిస్డ్ కాల్ ఇస్తే ఒక ఓటు నమోదు అవుతుంది. ఇలా పది సార్లు మిస్డ్ కాల్ ఇస్తే 10 ఓట్లు దివికి వస్తాయి. ఒకరికి 3, ఒకరికి 4, మరొకరికి 3 మిస్డ్ కాల్స్ ఇచ్చి  ఓట్లను షేర్ కూడా చేయవచ్చు. కింద ఉన్న నెంబర్లలో సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజులో డయల్ చేసే తొలి 10 నెంబర్లకు ఓట్లు పడతాయి.



హాట్‌స్టార్‌లో ఆన్‌లైన్ ఓటింగ్..
డిస్నీ హాట్‌స్టార్ యాప్ వాడుతున్న వారు సోవారం నుంచి శుక్రవారం వరకు ఎపిసోడ్ వీడియో మీద క్లిక్ చేయగానే ఓటింగ్ అని కనిపిస్తుంది. ఒక్క కంటెస్టెంట్ ఫొటో క్లిక్‌కు ఒక్క ఓటు. రోజుకు మొత్తం 10 ఓట్లు ఉంటాయి. వీటిని ఒకే వ్యక్తికి అయినా వేయవచ్చు. లేక ఒకరికి 4, మరొకరికి 4, మిగిలిన రెండు ఓట్లను ఇంకో సభ్యుడికి ఓట్లు షేర్ చేయవచ్చు. యాప్ లేని వారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి హాట్‌స్టార్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe