Sarayu: ఆమె బూతులు ఫేమస్. నోరు తెరిస్తే బూతులు తప్ప ఏమీ మాట్లాడదు. అవే ఆమెను పాపులర్ చేశాయి. ఆ తిట్ల దండకాలే యూట్యూబ్ స్టార్ ను చేశాయి. అంతేకాకుండా బిగ్ బాస్ గడప తొక్కేలా చేశాయి. ఎవరి గురించి చెప్తున్నామో మీకీపాటికే అర్థమై ఉంటుంది. ఆవిడే సరయూ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

7 ఆర్ట్స్‌ ఛానల్‌(7Arts Channel)లో ఆమె చేసే అడల్ట్‌ కామెడీకి ఎంతోమంది ఫ్యాన్స్‌ ఉన్నారు. అలాగే నోటికొచ్చినట్లుగా పచ్చి బూతులు మాట్లాడటాన్ని విమర్శించేవాళ్లూ లేకపోలేదు. ఏదేమైనా యూట్యూబ్‌ వీడియోలతో బాగా ఫేమస్‌ అయిన సరయూ(Sarayu) బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. కానీ బిగ్‌బాస్‌(Bigg Boss) హౌస్‌ను పూర్తిగా అర్థం చేసుకోలేక, అందులో ఇమడలేక మొదటి వారానికే ఎలిమినేట్ అయ్యింది.  


Also Read: BiggBoss Telugu Season 5: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 నుంచి సరయూ నామినేషన్‌కు కారణాలివే


తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన లవ్‌ స్టోరీ(Love Story) గురించి చెప్పుకొచ్చింది. 'ఒక వ్యక్తితో ఏడేళ్లు రిలేషన్‌లో ఉన్నాను. అది మా ఇంట్లో వాళ్లకు, అబ్బాయి ఇంట్లో వాళ్లకు కూడా తెలుసు. మా ఇంట్లో వాళ్లకు చెప్పకుండా నేనేదీ చేయను. రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు నా కెరీర్‌ను పక్కన పెట్టాను. రిలేషన్‌లో అతడికి 100 పర్సెంట్‌ ఇచ్చేశాను. నేను వర్జిన్‌ కూడా కాదు. మేము పెళ్లి చేసుకుందామనుకున్నాం, కానీ కుదరలేదు. 


కట్నం దగ్గర గొడవ రావడంతో పెళ్లిపీటల దాకా వచ్చిన వివాహం రద్దయిపోయింది. ముందు పాతిక లక్షలు అడిగారు, తర్వాత అరకోటి, కోటి, ఆ తర్వాత సగం ఆస్తి అడిగారు. ఇప్పటినుంచే ఇలా చేస్తే పెళ్లయ్యాక ఇంకెన్ని అడుగుతారో, ఇంకెలా ఉంటారో? అని క్యాన్సిల్‌ చేశాను. నువ్వు నాకు తగినవాడివి కాదని అతడి ముఖం మీదే చెప్పేశాను' అని చెప్పుకొచ్చింది సరయూ.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook