Bigg Boss Telugu: ఈ వారం బిగ్ బాస్ లో ఆసక్తికర ఎలిమినేషన్.. ఎవరు ఎలిమినేట్ అయ్యారంటే?
Bigg Boss Telugu 6: ఆదివారం నాటి ఎపిసోడ్ శనివారమే షూట్ చేస్తారు కాబట్టి బిగ్ బాస్ లీక్స్ ప్రకారం ఒకరు ఎలిమినేట్అయ్యారని అంటున్నారు కానీ ఆ విషయం నిజమా కాదా? అనేది ఆదివారం దాకా ఆగితే కానీ క్లారిటీ రాదు.
Faima Eliminated From Bigg Boss Telugu 6: తెలుగు తెరపై ఆసక్తికరంగా సాగుతున్న బిగ్ బాస్ సీజన్ దాదాపు చివరి అంకానికి చేరుకున్నట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే 13వ వారం నామినేషన్స్ ఆసక్తికరంగా సాగాయి. నిజానికి మునుపెన్నడూ లేని విధంగా ఈసారి 21 మంది సెలబ్రిటీలు కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే ప్రతివారం ఒకరిని ఎలిమినేటి చేస్తూ వస్తున్నారు, ఒకటి రెండు సందర్భాల్లో డబల్ ఎలిమినేషన్ పెట్టడం వల్ల ఆసక్తికరంగా ఈ ఎలిమినేషన్స్ సాగాయి.
తాజా నామినేషన్స్ ప్రకారం రోహిత్, ఫైమా, కీర్తి భట్, రేవంత్, ఆదిరెడ్డి, శ్రీ సత్య నామినేట్ అయ్యారు. ఇనయ సుల్తానా కెప్టెన్ కావడం వల్ల ఈ వారం నామినేషన్స్ నుంచి ఆమె దూరంగా ఉంది. ఇక శ్రీహాన్ కూడా ఈ వారం నామినేషన్స్ లో లేడు. ఇక నామినేట్ అయిన ఆరుగురికి సోమవారం రాత్రి అఫీషియల్ గా ఓటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వగా శుక్రవారం రాత్రి వరకు ఈ ఓటింగ్ ప్రాసెస్ సాగింది. ఇక నామినేషన్స్ లో ఉన్న అందరికంటే ఎక్కువ ఓటింగ్ శాతం రేవంత్ కి లభించినట్లు తెలుస్తోంది.
ఆ తర్వాత రెండో స్థానం రోహిత్ లభించినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత కామన్ మాన్ కోటాలో హౌస్ లోపలికి ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ రివ్యూయర్ ఆదిరెడ్డి మూడో స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది అని చెబుతున్నారు. ఇక ఆ తరువాత స్థానంలో కీర్తి భట్, శ్రీ సత్యాలు ఉన్నట్టుగా చెబుతున్నారు. ఆరవ స్థానంలో పైమా ఉందని ఆమె చివరి స్థానంలో ఉందని అంటున్నారు.
నిజానికి శ్రీ సత్య- ఫైమా మధ్య ఓటింగ్ శాతం పెద్దగా తేడా లేదు కానీ చివరికి ఫైమాకే దెబ్బ పడిందని అంటున్నారు. ఆదివారం నాటి ఎపిసోడ్ శనివారమే షూట్ చేస్తారు కాబట్టి బిగ్ బాస్ లీక్స్ ప్రకారం ఫైమా ఎలిమినేట్ అయిందని అంటున్నారు. ఆ విషయం ఆదివారం దాకా ఆగితే కానీ క్లారిటీ రాదు.
Also Read: Urvashi Rautela Opens: పంత్ తో రిలేషన్ ఇదే.. రామ్ పోతినేనిని లాగుతూ ఊర్వశి సంచలనం!
Also Read: Rajamouli Correct jr NTR : అదొక్కటే తప్పుగా మాట్లాడావ్ తారక్.. రాజమౌళి ట్వీట్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook