Bigg Boss Telugu TRP Ratings : బిగ్ బాస్ షోకు మామూలుగానే ఆదరణ ఉంటుంది. విదేశాల్లో పుట్టిన ఈ షో ఇప్పుడు ఇండియాలోని అన్ని భాషల్లోకి పాకింది. నార్త్‌లో అయితే ఎన్నో ఏళ్ల నుంచి బిగ్ బాస్ రన్ అవుతూనే ఉంది. ఇక తెలుగులో ఇప్పటికి ఆరు సీజన్లు అయ్యాయి. ఒక ఓటీటీ సీజన్ అయిపోయింది. ఆరు సీజన్లలో మొదటిది ఎన్టీఆర్, రెండోది నాని, మిగతా నాలుగింటిని నాగార్జున నడిపించాడు. శివ బాలాజీ, కౌశల్, రాహుల్ సిప్లిగంజ్, అభిజిత్, వీజే సన్నీ, సింగర్ రేవంత్ వరుసగా టైటిల్స్ గెలిచారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే బిగ్ బాస్ షోకు మాత్రం రాను రాను క్రేజ్ తగ్గిపోతూనే ఉంది. బిగ్ బాస్ మొదటి సీజన్ ఫినాలే ఎపిసోడ్‌కు వచ్చిన రేటింగ్స్.. ఆరో సీజన్‌కు వచ్చిన రేటింగ్స్ చూస్తేనే అది అర్థమవుతోంది. అయితే నాలుగో సీజన్‌ విషయంలోనే అత్యధిక రేటింగ్స్ వచ్చినట్టు కనిపిస్తోంది. అసలు మొదటి సీజన్‌కు క్రేజ్ బాగానే ఉన్నా కూడా అప్పటికి ఇంకా మన వాళ్లు బిగ్ బాస్ కల్చర్‌కు అంతగా అలవాటు పడలేదు. దీంతో శివ బాలాజీ విన్నింగ్‌ ఎపిసోడ్‌కు 14.13, రెండో సీజన్‌లో కౌశల్ విన్నింగ్ ఎపిసోడ్‌కు 15.05 రేటింగ్ వచ్చిందట.


 



మూడో సీజన్‌లో రాహుల్ విషయంలో 18.29, నాలుగో సీజన్‌లో అభిజిత్‌ క్రేజ్ వల్ల 19.51 రేటింగ్ వచ్చింది. అప్పుడున్న ఊపులో కాస్త అత్యధిక రేటింగ్స్ వచ్చాయి. ఐదో సీజన్‌లో విజే సన్నీ విన్నర్ అవ్వగా.. 16.04 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. అయితే ఇవన్నీ డబుల్ డిజిట్స్‌లో ఉన్నాయి. కానీ మొదటి సారిగా అత్యంత దారుణంగా రేటింగ్స్‌ను సాధించింది.


ఆరో సీజన్ ఎంత పరమ చెత్తగా సాగిందో అందరికీ తెలిసిందే. ఏ ఒక్క కంటెస్టెంట్‌ కూడా విన్నర్ మెటీరియల్ కాదని ముందే తేల్చేశారు జనాలు. ఉన్నంతలో రేవంత్ కాస్త బెటర్ అని, అతడే విన్నర్ అని ఎప్పుడో జనాలు ఫిక్స్ అయ్యారు. అందుకే ఫినాలే ఎపిసోడ్‌ను ఎవ్వరూ పట్టించుకోలేదేమో. దీంతో 8.17 రేటింగ్స్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది.


Also Read: Kalyaan Dhev New Year Post : ఈ ఏడాదిలో ఎన్నో నేర్చుకున్నా.. కళ్యాణ్‌ దేవ్ ఎమోషనల్ పోస్ట్


Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి