Bigg Boss Telugu OTT: బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ఎంటర్‌టైనర్‌గా ప్రారంభమైన ఓటీటీ తెలుగులో అప్పుడే ఎలిమినేషన్ల పర్వం సమీపిస్తోంది. మళ్లీ ఈసారి కూడా సరయు ఎలిమినేట్ కానుందా లేదా తప్పించుకుంటుందా అనేది ఆసక్తిగా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ నాన్‌స్టాప్ ఎంటర్‌టైనర్ స్టాప్ అయింది. సాంకేతిక కారణాలతో లైవ్ స్ట్రీమింగ్ నిల్చిపోయింది. ఇవాళ అంటే గురువారం రాత్రి నుంచి తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే..షోలో ఛాలెంజర్ల పేరుతో కొత్త కంటెస్టెంట్లు, వారియర్ల పేరుతో పాత కంటెస్టెంట్లు పోటీ పడుతున్నారు. ప్రారంభమైన తొలివారంలోనే ఘర్షణలు పెరిగిపోయాయి. 17 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన బిగ్‌బాస్ షోలో నామినేషన్ల పర్వం ముగిసింది. మరో రెండ్రోజుల్లో ఒకరు హౌస్ నుంచి వెళ్లిపోనున్నారు. అదెవరనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.


ఛాలెంజర్ల నుంచి మిత్ర శర్మ, ఆర్జే చైతూ నామినేట్ కాగా, వారియర్ల నుంచి సరయు, నటరాజ్, అరియానా, హమీదా, ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం ఎలిమినేట్ అయినవారిలో అరియానా, హమీదాకు అందరికంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇక మిగిలివారిలో ముమైత్ ఖాన్, నటరాజ్‌లకు కూడా సేవ్ అయ్యే పరిస్థితి ఉంది. ఇక మిగిలింది ముగ్గురు. ఆర్జే చైతు, మిత్ర శర్మ, సరయు. ఆర్జే చైతుకు హౌస్ బయట ఉన్న ఆర్జేల నుంచి భారీగా మద్దతు లభించవచ్చు. ఇక మిగిలింది సరయూ..మిత్ర శర్మలే. గత సీజన్‌లో సరయూ తొలివారమే హోస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. ఈ క్రమంలో ఈసారి కూడా తొలివారంలో నామినేషన్‌లో రావడంతో అందరికీ టెన్షన్ పట్టుకుంది. ఈసారి కూడా తొలివారమే హౌస్ నుంచి వెళ్లిపోతుందా అనే సందేహాలు వస్తున్నాయి. లేదా బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని వ్యక్తిగా ఉన్న మిత్ర శర్మ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ప్రేక్షకులు ఇద్దరినీ ఎలా రిసీవ్ చేసుకుంటారనే విషయంపై ఇదంతా ఆధారపడి ఉంటుంది. సరయూ గత సీజన్‌లో కూడా తొలివారమే ఎలిమినేట్ అవడంతో..ఈసారి కాస్తైనా సానుభూతి పనిచేసే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే హౌస్ నుంచి మిత్ర శర్మ ఎలిమినేషన్ పక్కా మరి.


Also read: Shilpa Shetty Attacks Rohit Shetty: రోహిత్ శెట్టిపై గ్లాస్ బాటిల్‌తో దాడి చేసిన శిల్పా శెట్టి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook