Bigg Boss Telugu season 6: కంటెస్టెంట్స్ లిస్టు లీక్.. ఎవరెవరు ఉన్నారంటే?
Bigg Boss Telugu season 6 Contestants List: త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ సీజన్ 6 కి సంబందించిన కంటెస్టెంట్స్ లిస్టు మీ ముందుకు.
Bigg Boss Telugu season 6 Contestants List: తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైన బిగ్ బాస్ షో ఇప్పటికే ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ బిగ్ బాస్ 6వ సీజన్ కు కూడా రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఈ సీజన్ సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు ఇప్పటికే 21 మంది కంటెస్టెంట్స్ క్వారంటైన్ కి వెళ్ళడానికి సిద్డమయ్యారని తెలుస్తోంది.
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు సుమారు 21 మంది కంటెస్టెంట్స్ ఈ సీజన్లో పాల్గొనబోతున్నారు. అందులో బాగా ప్రచారం జరుగుతున్న కొన్ని పేర్లను మీ ముందుకు తీసుకు వస్తున్నాం. సీరియల్ నటుడు అర్జున్ కళ్యాణ్, నటుడు బాలాదిత్య, నటి సుదీప, జబర్దస్త్ ఫేమ్ ఫైమా, చలాకీ చంటి, యూట్యూబర్ ఆదిరెడ్డి, ఇన్ఫ్లుయెన్సర్ గలాట గీతూ, రాజశేఖర్, శ్రీహాన్, రేవంత్, దీపిక పిల్లి, రోహిత్ అండ్ మరియా అనే ఒక నటీనటుల జంట, వాసంతి కృష్ణన్, యాంకర్ ఆరోహి రావు, అప్పారావు, తన్మై వంటి వారు పాల్గొనబోతున్నారని తెలుస్తోంది.
అయితే దీపికా పిల్లి స్థానంలో యాంకర్ వర్షిని ఎంట్రీ ఇచ్చిందని మరో ప్రచారం కూడా జరుగుతోంది. ఇక ఆ విషయం మీద మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తం షో 108 రోజుల పాటు నడవనుంది అని అంటున్నారు. అయితే ఒటీటీ వర్షన్ లాగానే 24 గంటల లైవ్ స్ట్రీమింగ్ ఉండబోతుందని తెలుస్తోంది. అలాగే టీవీ వ్యూవర్స్ కోసం ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం ఏడున్నర గంటల నుంచి పదిన్నర గంటల వరకు షో టెలికాస్ట్ సాగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ సారి నాగార్జున రెమ్యునరేషన్ సీజన్ మొత్తానికి కలిపి 20 కోట్లుగా ఉండబోతుందని అంటున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్ లో ఏవీ షూట్లు, డాన్స్ షూట్లు కంప్లీట్ అయ్యాయని 27, 28, 29 ఈ మూడు తారీఖులలో హైదరాబాద్ లోని పలు ఫైవ్ స్టార్ హోటల్స్ లో కంటెస్టెంట్లను క్వారంటైన్ చేయబోతున్నారని అంటున్నారు. అక్కడ ఉన్నప్పుడు వాళ్లకి ఫోన్ ఇస్తారు కానీ లోకేషన్ కనపడేలా పోస్టులు కానీ బిగ్ బాస్ రిలేటెడ్ పోస్టులు కూడా పెట్టకూడదని పరిమితులు విధించారు. ఇక మూడవ తేదీన హౌస్ లోపలికి పంపేటప్పుడు ఫోన్లు తీసేసుకుంటారు అని ప్రచారం జరుగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి