Bigg Boss’s Telugu OTT: బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ విషయంలో షాక్.. అసలు సంగతి అదేనా?
Bigg Boss’s Telugu OTT version Season 2 scrapped: బిగ్ బాస్ సీజన్ 1 ఓటీటీ వెర్షన్ డిజాస్టర్ కావడంతో ఇప్పుడు సెకండ్ సీజన్ చేసే ఉద్దేశం లేదని అంటున్నారు. ఆ వివరాలు
Bigg Boss’s Telugu OTT version Season 2 scrapped: ఎక్కడో దేశం కాని దేశంలో పుట్టి భారత్ లో కూడా విపరీతమైన పాపులారిటీ దక్కించుకున్న రియాలిటీ షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ షో మాత్రమే. ఇప్పటికే తెలుగులో ఈ బిగ్ బాస్ కి సంబంధించి 6 సీజన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. ఐదు ఆరు సీజన్లకు టిఆర్పి రేటింగ్ అనుకున్నంత రాకపోయినా ఏదో మమ అనిపించారు.
అయితే ఐదో సీజన్ పూర్తయిన తర్వాత హిందీలో బిగ్ బాస్ నిర్వాహకులు ఓటీటీ వర్షన్ ప్రారంభించడంతో తెలుగులో కూడా దాన్ని లాంచ్ చేశారు. తెలుగు ఓటీటీ వర్షన్ గత ఏడాది ప్రీమియర్ అయింది. అయితే ఈ ఏడాది రెండో సీజన్ ఉంటుందని అందరూ భావిస్తున్న తరుణంలో బిగ్ బాస్ యాజమాన్యం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ 6 టీవీలో ప్రసారం చేసి ఓటీటీలో రిలీజ్ చేస్తేనే ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది.
మళ్ళీ ఇప్పుడు సీజన్ 2 ఓటీటీ వెర్షన్ రిలీజ్ చేస్తే అది ఎంతవరకు ప్రేక్షకులను కనెక్ట్ అవుతుంది? ఒకవేళ ప్రేక్షకులను కనెక్ట్ కాకపోతే పెట్టిన డబ్బు వృధా అవ్వడం తప్ప దాని వల్ల ఉపయోగం లేదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే రెండో సీజన్ ఓటీటీ వర్షన్ లో అసలు చేయకూడదని తాజాగా నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు బిగ్ బాస్ నిర్వాహకుల తీరుతో విసిగిపోయిన నాగార్జున ఇక పూర్తిగా బిగ్ బాస్ షో నుంచి తప్పుకోవడానికి ప్రయత్నాలు చేసినట్లు చెబుతున్నారు.
రానా అనారోగ్యం దృష్ట్యా ఆయన సినిమాల్లో స్టంట్స్ లాంటివి చేయ లేరు కాబట్టి ఇంటికే పరిమితం అవ్వాలని భావిస్తున్నారని, కాబట్టి నా స్థానంలో రానాని తీసుకోమని నాగార్జున బిగ్ బాస్ నిర్వహకులకు సూచించినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆహాలోని అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న బాలకృష్ణ అయితే తమ షో కి వస్తే మరింత బూస్ట్ అవుతుందని బిగ్ బాస్ యాజమాన్యం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దానికి తగ్గట్టుగానే మా టీవీతో బిగ్ బాస్ యాజమాన్యానికి ఉన్న ఒప్పందం పూర్తవడంతో ఇతర టీవీ చానల్స్ కూడా ఈ షోని టెలికాస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని తెలుస్తోంది. చూడాలి చివరికి ఏమౌతుంది? ఎవరు ఈ షోని టెలికాస్ట్ చేస్తారు అనేది.
Also Read: K Viswanath Funeral: కే.విశ్వనాథ్ అంత్యక్రియలు అధికారిక లాంచనాలతో ఎందుకు చేయలోదో తెలుసా?
Also Read: K Viswanath Body buried: విశ్వనాథ్ శరీరాన్ని దహనం చేయకుండా ఎందుకు పూడ్చి పెట్టారో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.