BiggBossTelugu5 episode 18 promo highlights : బిగ్‌బాస్‌ ఇచ్చిన హైదరాబాద్‌ అమ్మాయి - అమెరికా అబ్బాయి ఫన్నీ టాస్క్‌లో కంటెస్టెంట్లు సూపర్బ్‌గా ఫర్ఫామెన్స్ చేశారు. ఈ విషయం రీసెంట్‌ బిగ్‌బాస్‌ ప్రోమో చూస్తేనే అర్థమైపోతుంది. ఈ టాస్క్‌లో హౌజ్‌మేట్స్‌ కూడా బాగా ఎంజాయ్‌ చేశారు. అమెరికా అబ్బాయి పాత్రలో శ్రీరామ్‌ (Sriram) జీవిస్తున్నారు. ఓ వైపు హమీదాతో (hamida), సిరిలతో (siri) లవ్‌ ట్రాక్‌ నడుపుతూనే మరోవైపు లహరితో (Lahari) మ్యారేజ్‌ ఫిక్స్ చేసేసుకున్నాడు టాస్క్‌లో. ఇలాంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీస్‌ చాలానే నడిచాయి రీసెంట్‌ ఎపిసోడ్‌లో. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లహరి మానస్‌తో లవ్‌ ట్రాక్


లహరి కూడా మానస్‌ను (Manas) ప్రేమిస్తూనే శ్రీరామ్‌తో మ్యారేజ్‌కి రెడీ అయ్యింది. శ్రీరామ్ తల్లి పాత్రలో ఉన్న ప్రియ..(Priya) లహరిపై నీ అభిప్రాయం ఏంటి అని శ్రీరామ్‌ని అడగగా.. నాకేం లేదు మమ్మీ.. నువ్వు సై అంటే నేను రయ్ అంటా అని అంటారు శ్రీరామ్. మొత్తానికి శ్రీరామ్‌, లహరికి పెళ్లి జరిపించేశారు బిగ్‌బాస్ హౌజ్‌మేట్స్‌. 


పెళ్లి వేడుకకు శుభం కార్డు 


ఇద్దరూ ఉంగరాలు, దండలు మార్చుకోవడంతో పెళ్లి వేడుకకు శుభం కార్డు పడింది. మొత్తానికి టాస్క్‌ సక్సెస్‌ఫుల్‌గా రన్ అయ్యింది అనే టైమ్‌లో బిగ్‌బాస్‌ హౌస్‌లో (Bigg Boss house) ఫోన్‌ మోగింది. హడావుడిగా ఫోన్‌ లిఫ్ట్‌ చేసిన ప్రియకు.. మీకో బ్యాడ్‌ న్యూస్‌ (Bad News) చెప్పబోతున్నానంటూ అవతలి వ్యక్తి అన్నాడు.



 


Also Read : Liger: లైగర్ టీమ్‌ను సర్‌ప్రైజ్ చేసిన బాలయ్య


సస్పెన్షన్‌


ఆ బ్యాడ్‌ న్యూస్‌ ఏంటి అనేదే సస్పెన్షన్‌గా మారింది. మరి ఈ రోజు ఎపిసోడ్‌లో ఆ బ్యాడ్‌ న్యూస్‌ ఏంటో తెలిసిపోనుంది. అయితే అది ప్రియకు మాత్రమే బ్యాడ్‌ న్యూసా? లేదంటే హౌజ్‌మేట్స్ (Housemates) అందరికా అనేది తెలియాలంటే ఇవ్వాల్టి ఎపిసోడ్‌ చూస్తేనే అర్థమవుతుంది.


శ్వేత, షణ్ముఖ్‌ల స్కెచ్


అంతేకాదు మరికొన్ని హైలెట్స్ కూడా ఈ రోజు టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్‌లో ఉన్నాయి. శ్వేత, (Swetha) షణ్ముఖ్‌ (shanmukh) ఓ డీల్ గురించి మాట్లాడుకోవడం.. లోబోని (Lobo) పక్కకి తప్పించి వారిద్దరూ డబ్బులు తీసుకోవాలని స్కెచ్ వేసుకుంటారు. పెళ్లి చేసుకుందాం శ్వేత అని షణ్ముఖ్‌ చెప్పగానే ఒకే అన్నట్లు సిగ్నల్ ఇస్తుంది శ్వేత కానీ తర్వాత ఐ లవ్‌ యు శ్వేత.. నువ్వంటే నాకు పిచ్చి... అని లోబో చెప్పగానే శ్వేత నవ్వుతూ థ్యాంక్యూ అని చెబుతుంది. ఈ సీన్‌ చూసిన షణ్ముఖ్‌ చూసిన శ్వేతపై ఓ కామెంట్ చేస్తాడు. ఏమైనా అందామంటే ముఖం మీద పెయింట్‌ వేసి కొడుతుంది.. అంటూ తన ఫ్రస్టేషన్‌ చూపిస్తాడు షణ్ముఖ్‌. మొత్తానికి ఇవాల్టి బిగ్‌బాస్‌ (Bigg boss) ఎపిసోడ్ అంతా కాస్త రసవత్తరంగానే ఉండనుంది.



Also Read : MAA Elections 2021: తన ప్యానెల్ ను ప్రకటించనున్న మంచు విష్ణు!

 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి