Bimbisara Movie: హిట్టు కొట్టిన కళ్యాణ్ రామ్.. కాలర్ ఎగరేస్తున్న నందమూరి ఫాన్స్!
Nandamuri Fans Happy With Bimbisara Movie: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన బింబిసార మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలో నందమూరి అభిమానులు గాల్లో తేలుతున్నారు.
Nandamuri Fans Happy With Bimbisara Movie: కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం బింబిసార. పటాస్ తరువాత సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్ సుమారు రెండున్నరేళ్ల పాటు వెచ్చించి మరి బింబిసారా అనే సినిమా చేశారు. సీనియర్ నిర్మాత మల్లిడి సత్యనారాయణ కుమారుడు మల్లిడి వశిష్ట ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయమయ్యారు. సినిమా విడుదలకు ముందే సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడ్డాయి.
దానికి తోడు ఎన్టీఆర్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరై సినిమా మీద మరింత అంచనాల పెంచేశాడు. ఇక ఆగస్టు 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బింబిసారకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. పటాస్ తర్వాత కళ్యాణ్ రామ్ మరో హిట్ సాధించినట్టే అని సినిమా చూసిన వారు కామెంట్లు చేస్తున్నారు. దీంతో నందమూరి అభిమానులైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది చివర్లో నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో హిట్టు కొట్టారని, తర్వాత మార్చి నెలలో ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ హిట్టు కొట్టారని ఇప్పుడు అదే జోష్ కంటిన్యూ చేస్తూ కళ్యాణ్ రామ్ కూడా హిట్టు కొట్టారని వారందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఒకరకంగా ఇది నందమూరి నామ సంవత్సరం అంటూ కూడా వాళ్ళందరూ ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ సినిమాను కళ్యాణ్ రామ్ తన సొంత ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీదనే నిర్మించారు. కళ్యాణ్ రామ్ బావమరిది కొసరాజు హరికృష్ణ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. కొసరాజు హరికృష్ణకు చెందిన విఎఫ్ఎక్స్ స్టూడియోలోనే సినిమా విఎఫ్ఎక్స్ పనులన్నీ పూర్తి చేశారు..రొమాంటిక్ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించిన అనిల్ పాదూరి ఈ సినిమా విఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్ కావడం సినిమాకు మరింత ప్లస్ అయింది. తక్కువ బడ్జెట్ లోనే ది బెస్ట్ విఎఫ్ఎక్స్ షాట్స్ అందించి సినిమాను ఆసక్తికరంగా రూపొందించారు మేకర్స్. ఎట్టకేలకు కళ్యాణ్ రామ్ సూపర్ హిట్ కొట్టడంతో నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Bimbisara Review: కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ సినిమా ఎలా ఉందంటే?
Also Read: Sita Ramam Twitter Review: ప్రేక్షకుల ముందుకు 'సీతారామం'.. టాక్ ఎలా ఉందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook