August Tollywood Releases: బింబిసార టు లైగర్.. ఆగస్టులో సందడి చేయనున్న తెలుగు సినిమాలివే!
Tollywood Movies Releasing in August: ఆగస్టు నెలలో పలు ఆసక్తికర సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఆ సినిమాల లిస్టు మీ కోసం
Tollywood Movies Releasing in August: తెలుగు సినీ పరిశ్రమలో బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు చిన్న సినిమాలు పోటీ పడుతున్నాయి. ఆగస్టు నెలలో కొన్ని ఆసక్తికర సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక ఇప్పటికే పెద్ద సినిమాలు అన్నీ విడుదల అయిపోవడంతో ఇప్పుడు మరోమారు చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడేందుకు సిద్ధం అవుతున్నాయి. ఆగస్టు నెలలో ఏకంగా 14 సినిమాలు విడుదల కాబోతున్నాయి.
దాదాపు అన్నీ చిన్న సినిమాలే అయినా వాటిలో కొన్ని సినిమాలపై మాత్రం మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ముందుగా ఆగస్టు 5వ తేదీన దుల్కర్ సల్మాన్ సీతారామం, కళ్యాణ్ రామ్ బాంబిసార భారీ సినిమాలు విడుదల కానున్నాయి. భారీ అంచనాలతో విడుదలవుతున్న అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా హిందీతో పాటు తెలుగులో కూడా విడుదల అవుతోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి సమర్పణలో గీతా ఆర్ట్స్ ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆగస్టు 11న భారీ ఎత్తున విడుదల చేస్తోంది.
నాగచైతన్య కూడా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. స్ట్రైట్ తెలుగు సినిమాల్లో మాత్రం అందరి ఫోకస్ ఎక్కువగా కార్తికేయ 2 సినిమాపై ఉంది. నిఖిల్ హీరోగా అనుపమ హీరోయిన్ గా వచ్చిన ఈ మూవీ ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమా మీద నమ్మకంతో ఆగస్టు 12వ తేదీన మిగతా సినిమాల నుంచి పోటీ ఉన్నా కూడా విడుదల చేయడానికి సినిమా యూనిట్ సిద్ధమయింది. ఇక అదే రోజున హీరో నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా విడుదల కానుంది.
ఇక ఈ సినిమా ఒక పక్క సాంగ్స్ తో మరోపక్క కుల వివాదాలతో హాట్ టాపిక్ అయింది. ఇక బెల్లకొండ సురేష్ చిన్న కొడుకు మొదటి సినిమా స్వాతి ముత్యం ఆగస్టు 13న విడుదల కానుంది. అలాగే ఆది సాయి కుమార్ తీస్ మార్ ఖాన్, ఇక అదే రోజు సునీల్, సుడిగాలి సుధీర్ వంటి వారు నటించిన వాంటెడ్ పండుగాడు, మాటేరాని మౌనమిది, కమిట్మెంట్ అనే సినిమాలు కూడా విడుదల కానున్నాయి. ఇక విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ సినిమా ఆగస్టు చివరి వారంలో 25న విడుదల అయింది. ఇవి కాక మరికొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా విడుదల కానున్నాయి.
Also Read: Nirmala Mishra: హార్ట్ ఎటాక్‌తో ప్రముఖ సింగర్ కన్నుమూత.. ఆసుపత్రికి తరలించారు కానీ!
Also Read: Commitment: క్షమాపణలు చెప్పిన కమిట్మెంట్ డైరెక్టర్.. తానూ హిందువునే అంటూ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook