Ram Charan to launch Yash's KGF Chapter 2 Telugu trailer: కన్నడ స్టార్ హీరో 'యష్' ప్రధాన పాత్రలో నటించిన 'కేజీఎఫ్' సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమాతో యష్ అన్ని భాషల్లో భారీ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కేజీఎఫ్ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న చిత్రమే 'కేజీయఫ్‌ చాప్టర్‌ 2'. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ శాండల్‌వుడ్ చిత్రం ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధంగా ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేజీయఫ్‌ చాప్టర్‌ 2 సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండడంతో.. చిత్రబృందం ప్రమోషన్స్ మొదలెట్టింది. ఆదివారం (మార్చి 27) ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల కానుంది. ఇందుకోసం చిత్ర బృందం ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తోంది. బాలీవుడ్‌ నిర్మాత, దర్శకుడు కరణ్‌ జోహార్‌ ఈ ఈవెంట్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇక కన్నడ నటుడు శివరాజ్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఇక కేజీయఫ్‌ 2 తెలుగు ట్రైలర్‌ను మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ విడుదల చేయనున్నారు. 


రామ్‌ చరణ్‌ కేజీయఫ్‌ చాప్టర్‌ 2 సినిమా ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారని హోంబాలే ఫిల్మ్స్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. ఆదివారం పుట్టిన రోజు జరుపుకొంటున్న రామ్ చరణ్‌.. ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేయటం సంతోషంగా ఉందని పేర్కొంది. సాయంత్రం 6.40 గంటలకు ట్రైలర్‌ను విడుదల కానుంది. ఇక తమిళ ట్రైలర్‌ను స్టార్ హీరో సూర్య విడుదల చేస్తారు. ట్రైలర్‌ విడుదల చేస్తుండటంతో సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ట్రైలర్‌ ఈవెంట్‌కు తెలుగు విలేఖరులు కూడా హాజరు కాబోతున్నారు. ఇప్పటికే తెలుగు బృందం బెంగుళూరు చేరుకుంది.



ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన 'కేజీఎఫ్ 2' సినిమాని హోంబాలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల అవ్వనుంది. ఈ పాన్ ఇండియా చిత్రంలో యష్ సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించింది. బాలీవుడ్ స్టార్లు రవీనా టాండన్, సంజయ్ దత్.. ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితరులు నటించారు. రవి సంగీతం అందించిన ఈ సినిమాలోని మొదటి పాట తాజాగా విడుదల అయి పెద్ద సంచలనం సృష్టించింది. 


Also Read: Suryakumar Yadav: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌.. ఢిల్లీతో మ్యాచ్‌కు దూరమయిన స్టార్ బ్యాటర్! ఏబీడీకి ఛాన్స్!!


Also Read: CSK vs KKR Turning Point: మ్యాచ్ టర్నింగ్ పాయింట్.. అంతా జడేజానే చేశాడు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook