BJP Leader Chitra Wagh Demands Urfi Javed Arrest: ఉర్ఫీ జావేద్ తన అసాధారణ ఫ్యాషన్ సెన్స్ వల్ల వార్తల్లో నిలవడం చాలా కామన్ అయింది. కొన్నిసార్లు ఉర్ఫీ యొక్క ఫ్యాషన్ సెన్స్ చాలా బాగుందని ప్రశంసించబడితే కొన్నిసార్లు ఆమె ధరించిన బట్టలు ఆమెకు ఇబ్బందిగా మారతాయి. ఉర్ఫీ తరచుగా ఆమె దుస్తుల కోసం ట్రోల్ చేయబడుతోంది, కొన్నిసార్లు ఆమె బట్టల విషయంలో పోలీసులకు ఫిర్యాదులు కూడా అందాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఇప్పుడు ఆమె మీద ఒక బీజేపీ మహిళా నేత కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక బోల్డ్ లుక్ కారణంగా ఉర్ఫీని టార్గెట్ చేశారు మహిళా బీజేపీ నేత. భారతీయ జనతా పార్టీ మహిళా నేత చేత్రా కిషోర్ వాగ్ ట్విట్టర్‌లో ఒక వీడియోను పంచుకోవడం ద్వారా ఉర్ఫీ జావేద్‌ను టార్గెట్ చేశారు. చేత్ర కిషోర్ తన పోస్ట్‌లో ఉర్ఫీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె షేర్ చేసిన వీడియోలో ఉర్ఫీ బ్లాక్ కలర్ వింత డ్రెస్‌లో కనిపిస్తుండగా ఆమె 'హే ముంబైలో ఏమి జరుగుతోంది. వీధుల్లో బహిరంగంగా నగ్నత్వం చూపుతున్న ఈ మహిళపై ముంబై పోలీసులకు ఏదైనా IPC లేదా CrPC సెక్షన్‌లు ఉన్నాయో లేదో? అని కామెంట్ చేసింది.


ఉర్ఫీకి సంకెళ్లు వేయాలని డిమాండ్ చేయగా చేత్ర కిషోర్ చేసిన ఈ ట్వీట్‌కి ఉర్ఫీ జావేద్ కూడా ఘాటు రిప్లై ఇచ్చింది. 'మీలాంటి మహిళా నాయకురాలు ఉండటం మహిళల భద్రతకు ఇబ్బందిగా ఉంది, నా టాపిక్ పక్కన పెట్టండి, సహాయం అవసరమైన మహిళల కోసం అసలు ఎందుకు మీరు ఏమీ చేయలేదు? మహిళా విద్య, అత్యాచారాలకు సంబంధించిన లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయా? మీరు ఈ సమస్యలను ఎందుకు లేవనెత్తరు?' అని ఆమె ప్రశ్నించింది.


ఇక ఈ రోజు చేత్రా మరో ట్వీట్ చేసింది, అందులో ఉర్ఫీ "ముంబై వీధుల్లో బహిరంగ నగ్నత్వంలో మునిగిపోయిందని ఆరోపించింది. అంతే కాదు ఉర్ఫీని అరెస్ట్ చేయాలని పోలీసులను కూడా డిమాండ్ చేశాడు, అలాగే ఆమె మీద పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇక ఉర్ఫీ జావేద్ ఇప్పుడు 'స్ప్లిట్స్‌విల్లా' యొక్క తాజా సీజన్‌లో కనిపిస్తుంది.


Also Read: Rashmika-Vijay: మరోసారి అడ్డంగా దొరికేసిన విజయ్ దేవరకొండ- రష్మిక.. చూసుకోకపోతే ఎలా అబ్బా?


Also Read: Shock to Mythri Movie Makers: మైత్రీ మూవీ మేకర్స్ కు దిల్ రాజు వరుస షాకులు.. పోటీగా మూడు సినిమాలు రిలీజ్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook