Black Widow Telugu Trailer: అవెంజర్స్.. ఈ పేరు వినగానే చిన్నారులతో పాటు యువత సైతం ఎంతో ఆసక్తి ఎదురుచూస్తుంటుంది. రెండేళ్ల కిందట ఇంగ్లీష్ భాషలో అవెంజర్స్: ది ఎండ్ గేమ్ విడుదలై భారీ వసూళ్లు రాబట్టింది. అందులో ఓ లేడీ సూపర్ స్టార్ స్కార్లెట్ జాన్సన్. ‘బ్లాక్ విడో‌’గా సూపర్ పవర్ ఉన్న హీరోస్‌లో ఆమె ఒకరుగా తెరమీద కనిపిస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్కార్లెట్ జాన్సన్ లీడ్ రోల్‌లో నటించిన తాజా సినిమా ‘బ్లాక్ విడో’. ఈ సినిమా జూలై 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. అయితే ఈసారి తెలుగు ప్రేక్షకుల కోసం ఆసక్తికరంగా ట్రైలర్ తీసుకొచ్చారు. బ్లాక్ విడో స్కార్లెట్ జాన్సన్(Scarlett Johansson) చేసే సాహసాలు ఈ ట్రైలర్‌లో అనుకున్న రీతిలో చూపించారు. మార్వెల్ స్టూడియోస్ ధన్యవాదాలు అంటూ టాలీవుడ్ ప్రేక్షకులు ఈ ట్రైలర్‌ను తెలుగులో తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ విడో తెలుగు ట్రైలర్(Black Widow Telugu Trailer) వీక్షించి ఎంజాయ్ చేయండి.



Also Read: Sonu Sood: మరోసారి గొప్ప మనసు చాటుకున్న నటుడు సోనూ సూద్, సాయం చేయాలంటూ విజ్ఞప్తి


అవెంజర్స్ గత చిత్రాల మాదిరిగానే మార్వెల్ స్టూడియోస్ సంస్థ ‘బ్లాక్ విడో’ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించింది. కేట్ షార్ట్‌లాండ్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇంగ్లీష్ భాషతో పాటు భారతీయ భాషలైన తమిళం, కన్నడ, తెలుగు, మలయాళం మరియు హిందీ భాషల్లో మీ ముందుకు రానుంది. అసలే కరోనా వైరస్‌తో విసిగిపోయిన ప్రేక్షకులు వినోదాన్ని పొందేందుకు బ్లాక్ విడో మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Also Read: Malaika Arora Engagement: మలైకా అరోరా, అర్జున్ కపూర్ ఎంగేజ్‌మెంట్ జరిగిందా, హాట్ టాపిక్‌గా మారిన డైమండ్ రింగ్ 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook