Manchu Manoj about Bheemla Nayak Movie: అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా 'భీమ్లా నాయక్' ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా.. ప్రీమియర్ షోలు గురువారం అర్ధరాత్రే ఓవర్సీస్‌లో ప్రదర్శితం అయ్యాయి. ఈరోజు ఉదయం నుంచి మన దగ్గర విడుదల అయి దూసుకెళుతోంది. భీమ్లా నాయక్ ఇటు సినిమాకు ప్రేక్షకుల నుంచి, అటు విమర్శకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం థియేటర్లలో పవన్ హవా నడుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా.. 'పవన్‌ మేనియా' కనిపిస్తోంది. భీమ్లా నాయక్ సినిమా 'సూపర్‌ హిట్‌' అంటూ అందరూ వరుస పోస్టులు పెడుతున్నారు. టాలీవుడ్‌ ప్రముఖులు సైతం 'భీమ్లా నాయక్‌'పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా హీరో మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'ఒకే ఫ్రేమ్‌లో నాకు ఇష్టమైన ఇద్దరు వ్యక్తులు. సినిమాపై సానుకూల స్పందనలు వస్తున్నందుకు  చాలా సంతోషంగా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నకు, నా డార్లింగ్ రానా దగ్గుబాటికి మరియు చిత్ర బృందానికి అభినందనలు. బొమ్మ బ్లాక్ బస్టర్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా' అని మనోజ్ ట్వీటారు. 



డైరెక్టర్ హరీశ్‌ శంకర్‌ 'భీమ్లా నాయక్‌'పై తన అభిప్రాయం చెప్పాడు. 'భీమ్లానాయక్‌ పాత్రలో పవన్‌ కల్యాణ్‌ సింహ గర్జన చేశారు. చాలా రోజు తర్వాత థియేటర్‌లలో పవన్ నట గర్జన చూడటం అద్భుతంగా ఉంది. రానాలో నేను కేవలం డేనియల్‌ శేఖర్‌ని మాత్రమే చూశా. నువ్వు అదరగొట్టేశావు. తమన్ అందించిన మ్యూజిక్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇది బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కాదు.. బ్యాక్‌బోన్‌ ఆఫ్‌ భీమ్లా! నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది బావా. సాగర్‌ కె చంద్ర, త్రివిక్రమ్‌, నాగవంశీకి అభినందనలు' అని హరీశ్‌ శంకర్‌ వరుస ట్వీట్లు చేశారు. 


Also Read; Bheemla Nayak Review: భీమ్లా నాయ‌క్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?


Also Read: Ravindra Pushpa: లైవ్‌ మ్యాచ్‌లోనే చూపించేసిన రవీంద్ర జడేజా.. నవ్వుకున్న రోహిత్ శర్మ (వీడియో)



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook