Bitcoin Scam: బిట్ కాయిన్ స్కాంలో శిల్పాశెట్టి దంపతుల మెడకు ఈడీ ఉచ్చు, 98 కోట్ల ఆస్థులు జప్తు
Bitcoin Scam: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి దంపతుల మెడకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగుసుకుంది. మనీ లాండరింగ్ ఆరోపణలపై కేసు నమోదు చేసిన ఈడీ భారీగా ఆస్థుల్ని సీజ్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bitcoin Scam: క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ కుంభకోణం కేసులో ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగించింది. ఈ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలుండటంతో కేసు నమోదు చేసిన ఈడీ శిల్పాశెట్టి-రాజ్ కుంద్రాలకు చెందిన 98 కోట్ల ఆస్థుల్ని జప్తు చేసింది.
బిట్ కాయిన్‌లో పెట్టుబడి పెడితే నెలకు 10 శాతం లాభాలు వస్తాయంటూ మోసం చేసిన కేసు ఇది. మల్టీ లెవెల్ మార్కెటింగ్ ద్వారా సామాన్య జనం నుంచి 2017 వరకూ 6600 కోట్లు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. మొత్తం డబ్బులు వసూలు చేసిన తరువాత ఇన్వెస్టర్లను మోసం చేసి బోర్డు తిప్పేయడంతో మహారాష్ట్ర, ఢిల్లీల్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే సింపీ భరద్వాజ్, నితిన్ గౌడ్, నిఖిల్ మహాజన్‌లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. మొత్తం స్కాంలో మాస్టర్ మైండ్‌గా భావిస్తున్న అమిత్ భరద్వాజ రెండేళ్ల క్రితం మరణించాడు. ఇతడి నుంచి 285 బిటి కాయిన్లు తీసుకున్న రాజ్ కుంద్రా ఉక్రెయిన్ దేశంలో బిట్ కాయిన్ మైనింగ్ ఫామ్ ఏర్పాటు చేయాలని బావించాడు. మరో ఇద్దరు ప్రధా నిందితులు అజయ్ భరద్వాజ్, మహేంద్ర భరద్వాజ్‌లు పరారీలో ఉన్నారు.
ఈ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలుండటంతో శిల్పా శెట్టి-రాజ్ కుంద్రాలకు చెందిన 98 కోట్ల ఆస్థుల్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సీజ్ చేసింది. ఇందులో ముంబైలోని జుహూ ప్లాట్, పూణేలోని బంగ్లా ఉన్నాయి. అదే విధంగా రాజ్ కుంద్రాకు చెందిన కొన్ని ఈక్విటీ షేర్లు కూడా ఉన్నాయి.
Also read: Heat Waves Alert: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడ్రోజులు తీవ్ర వడగాల్పులు, తస్మాత్ జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook