Abhishek Aishwarya Viral Video: ఐశ్వర్యారాయ్‌ను దూరం నెట్టి అవమానించిన అభిషేక్, వైరల్ వీడియో
Abhishek Aishwarya Viral Video: గత కొద్దిరోజులుగా అభిషేక్ బచ్చన్ వర్సెస్ ఐశ్వర్యా రాయ్ విడాకుల వార్తలు గట్టిగా వైరల్ అవుతున్నాయి. ఇద్దరికి పడటం లేదని, అభిషేక్ ప్రవర్తనే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ వార్తలకు బలం చేకూర్చే రెండు వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో అందరిముందు భార్య ఐశ్వర్యను అవమానించడం స్పష్టంగా చూడవచ్చు.
బాలీవుడ్ దంపతులు ఐశ్వర్యా రాయ్ వర్సెస్ అభిషేక్ బచ్చన్ త్వరలో విడాకులు తీసుకోనున్నారనే వార్తకు బలం చేకూరే అంశాలు చాలానే కన్పిస్తున్నాయి. ఇద్దరూ గత కొద్దికాలంగా దూరంగానే ఉంటున్నారని సమాచారం. అంతే కాకుండా బాలీవుడ్ అప్‌కమింగ్ నటి నిమ్రిత్ కౌర్‌తో అభిషేక్ బచ్చన్ ఎఫైర్ నడుస్తోందని..ఇదే ఐశ్వర్యా రాయ్ వర్సెస్ అభిషేక్ బచ్చన్ మధ్య దూరం పెంచిందని తెలుస్తోంది. ఇందుకు తగ్గట్టే ఓ వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది.
వాస్తవానికి ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్ మధ్య విడాకులు లేదా విబేధాలపై అధికారికంగా ఎవరూ చెప్పకపోయినా ఇరువురి వైఖరి ఇందుకు అద్దం పడుతోంది. ఈ మధ్య కొన్ని వేడుకల్లో అభిషేక్ బచ్చన్ వివాహ ఉంగరం లేకుండానే హాజరవుతుండటం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. అంతేకాకుండా ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహ కార్యక్రమానికి సైతం ఇద్దరూ విడివిడిగా హాజరయ్యారు. ఐశ్వర్యారాయ్ తన కుమార్తె ఆరాధ్యతో కలిసి హాజరై ఫోటో దిగింది. అటు అభిషేక్ బచ్చన్ విడిగా వచ్చి ఫోటోకు పోజులిచ్చారు. ఇద్దరూ కలిసి ఏ వేడుకలోనూ కన్పించలేదు.
అంతేకాకుండా ఓ బహిరంగ వేదికపై ఐశ్వర్యను అందరిముందు వదిలేసి వెళ్లిపోయి అవమానించడం, ఐశ్వర్యా వారిస్తున్నా వినకుండా వెళ్లిపోవడం వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. మరోవైపు ఏ నటితో అయితే ఎఫైర్ ఉందనే వార్తలు వస్తున్నాయో ఆ నటి నిమ్రిత్ కౌర్‌తో కపిల్ శర్మ కామెడీ షోలో కావాలని దగ్గరకు జరిగి కూర్చోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. మొత్తానికి ఐశ్వర్యాను అందరి ముందు అవమానించిన ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.