బాలీవుడ్లో విషాదం.. అనారోగ్యంతో సీనియర్ నటుడు అనుపమ్ శ్యామ్ కన్నుమూత
ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ శ్యామ్(63) అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Actor Anupam Shyam Dies: ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ శ్యామ్ (63)(Anupam Shyam) కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
కిడ్నీ సమస్యలకు గత కొంతకాలంగా ఇంట్లోనే డయాలసిస్ చేయించుకుంటున్న ఆయన నాలుగు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ముంబైలోని సిటీ ఆస్పత్రిలో బర్బన్ గోరేగావ్‌లోని లైఫ్‌లైన్ ఆసుప్రతిలో చేర్చారు.ఈ క్రమంలో చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందినట్లు అనుపమ్ స్నేహితుడు యశ్‌పాల్ శర్మ(Yashpal Sharma) తెలిపారు. అనుపమ్(Anupam Shyam) తుది శ్వాస విడిచిన సమయంలో ఆయన వద్దే తన సోదరులు అనురాగ్, కంచన్ ఉన్నారని, సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు యశ్‌పాల్ శర్మ స్పష్టం చేశారు.
Also read:'ఒక్క రూపాయి సంపాదించలేదు.. ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు'.. నరేష్‌పై హేమ సంచలన వ్యాఖ్యలు
అనుపమ్ ‘మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞ’(Mann Kee Awaaz: Pratigya) వంటి పలు టీవీ సీరియల్స్‌తో పాటు స్లమ్‌డాగ్ మిలియనీర్, బందిపోటు, క్వీన్ వంటి చిత్రాల్లో నటించారు. ‘మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞ’ సీరియల్‌లో ఠాకూర్ సజ్జన్ సింగ్ పాత్ర పోషించిన అనుపమ్ శ్యామ్ (Anupam Shyam) విమర్శకుల నుంచి ప్రశంసలు సైతం అందుకున్నారు. 2009లో ప్రసారమైన ఈ సీరియల్ సెకండ్ సీజన్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే.
మూడు దశాబ్దాల సుదీర్ఘమైన కెరీర్‌లో 'సత్య, దిల్ సే, లగాన్, హాజరోంకి క్వాయిషీన్ ఐసీ' లాంటి అద్భుతమైన చిత్రాల్లో నటించారు. అనుపమ్ శ్యామ్(Anupam Shyam) కన్నుమూయడంతో బాలీవుడ్(Bollywood)లో విషాదం అలుముకుంది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
Also read:బెంగాల్ ను ముంచెత్తిన వరదలు...జలదిగ్బంధంలో పలు ప్రాంతాలు..23 మంది మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook