Bollywood Actors arrested: రష్మిక పేరుతో 20 లక్షల టోకరా..హైదరాబాద్‌లో బాలీవుడ్ నటీనటులు అరెస్ట్!
Bollywood Actors arrested: హైదరాబాదులో మోసాలకు పాల్పడుతున్న ఒక బాలీవుడ్ నటుడిని, నటిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఆ వివరాల్లోకి వెళితే
Bollywood Actors Apoor aswhin Natasha Kapoor arrested: హైదరాబాదులో మోసాలకు పాల్పడుతున్న ఒక బాలీవుడ్ నటుడిని, నటిని అరెస్ట్ చేశారు పోలీసులు. అపూర్ అశ్విణ్, నటాషా కపూర్ అనే ఇద్దరినీ సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. చిన్న పిల్లలకు మోడలింగ్ లో శిక్షణ ఇచ్చి అవకాశాలు ఇస్తామని చెబుతూ మోసాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ర్యాంప్ షోలు నిర్వహిస్తామని వాటిలో మీకు అవకాశాలు ఇస్తామంటూ వారు మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
ప్రముఖ హీరోయిన్ రష్మికతో కలిసి మోడలింగ్ చేసే అవకాశం ఉందంటూ మాయమాటలు చెప్పడంతో ఒక వ్యాపారవేత్త నమ్మి 20 లక్షల వరకు సమర్పించుకున్నట్లు తెలుస్తోంది. కేవలం వ్యాపారవేత్తల పిల్లలకు మాత్రమే అవకాశం ఇస్తామని అందుకు కొంత మొత్తం తీసుకుంటామని చెబుతూ ఒక వ్యాపారవేత్త నుంచి దాదాపుగా 20 లక్షలు ఈ జంట వసూలు చేసినట్లు తెలుస్తోంది.
కాస్మోపాలిటన్ మోడల్ పేరుతో ఒక వెబ్సైట్ నిర్వహిస్తున్న ఈ ఇద్దరు తమ గుట్టలో పడిన హైదరాబాద్ వ్యాపారవేత్త నుంచి 20 లక్షలు వసూలు చేయడంతో అతను తన పిల్లలకు మోడలింగ్ అవకాశాలు వస్తాయని నమ్మాడు. అయితే ఎన్ని రోజులు గడుస్తున్నా వారి నుంచి ఎలాంటి కబురు లేక పోవడంతో తాను మోసపోయాననే విషయం అర్థం చేసుకుని వెంటనే సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ పోలీసులు ఈ విషయమై దర్యాప్తు జరిపి వీరిద్దరూ కలిసి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించి వెంటనే రంగంలోకి దిగారు.
వీరిద్దరినీ ప్రస్తుతానికి అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. నిజంగానే వారికి రష్మీకతో పరిచయం ఉన్నదా? లేక ఆమె పేరు పెట్టుకుని వీరు మోసాలకు పాల్పడుతున్నారా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇలాంటి ప్రకటనలు నమ్మవద్దని పోలీసులు ఎన్ని సార్లు చెబుతున్నా సామాన్యులు ఆశపడి మోసపోతున్న ఘటనలు ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయినా సరే సాధారణ ప్రజానీకం ఈ విషయాన్ని పట్టించుకోకుండా గ్లామర్ ప్రపంచంలో మెరవడానికి తమ ప్రయత్నాలు తాము చేస్తూనే ఉన్నారు.
Also Read: VSR vs WV Collections: మాంచి జోరు మీద వీరయ్య.. 41 కోట్ల తేడాతో వీర సింహ!
Also Read: Shooting Updates: పుష్ప 2, రావణాసుర సహా తెలుగు సినిమాల షూటింగ్ అప్డేట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook