Actress Kajol tests Covid positive: బాలీవుడ్‌ను కరోనా వెంటాడుతోంది. తాజాగా నటి కాజోల్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. కుమార్తె ఫోటోతో ఇన్‌స్టాలో పెట్టిన పోస్టులో తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. జలుబు కారణంగా ముక్కు ఎర్రగా మారిపోవడంతో.. తన ఫోటోను పోస్ట్ చేయట్లేదని పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎర్రబడిపోయిన నా ముక్కును ఎవరూ చూడొద్దనుకుంటున్నా. అందుకే చిరునవ్వుతోనే అల్లుకుపోదాం.మిస్ యూ నైసా దేవగన్..' అంటూ కాజోల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.  కరోనా కారణంగా తన కుమార్తెను మిస్ అవుతున్నట్లు చెప్పుకొచ్చారు. కాజోల్ చేసిన ఈ పోస్టులో ఆమె కుమార్తె చేతి నిండా మెహందీతో ముఖంపై బ్రైట్ స్మైల్‌తో ఫోటోకి పోజిచ్చారు. 


కాజోల్ పోస్టుపై స్పందిస్తున్న నెటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్ చేస్తున్నారు. నటి ప్రియాంక చోప్రా సైతం కాజోల్ పోస్టుపై స్పందించారు. 'స్టన్నింగ్' అంటూ కాజోల్ (Bollywood) కుమార్తెను ఉద్దేశించి ప్రియాంక కామెంట్ చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే.. 'త్రిభంగ' సినిమాతో కాజోల్ ఓటీటీ మార్కెట్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రేణుక షహనే డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి వీక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం కాజోల్ రేవతి దర్శకత్వంలో 'ది లాస్ట్ హుర్రే' అనే చిత్రంలో నటిస్తున్నారు.



Also Read: Viral Video: పెళ్లి వేడుకలో వధువుకు సోదరుల వినూత్న ఆహ్వానం.. గుండెలు పిండేస్తున్న వీడియో!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook