Nora Fatehi tests covid 19 positive: బాలీవుడ్‌లో (Bollywood) కరోనా తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే కరీనా కపూర్, అమృతా అరోరా, అర్జున్ కపూర్ కరోనా బారిన పడగా... తాజాగా మరో బాలీవుడ్ నటి నోరా ఫతేహీ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆమె క్వారెంటైన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని నోరా ఫతేహీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు (Omicron cases in India) పెరుగుతున్న వేళ ఇలా బాలీవుడ్ నటీనటులు వరుసగా కరోనా బారినపడటం ఆందోళన రేకెత్తిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'హే గాయ్స్.. దురదృష్టవశాత్తు నేనిప్పుడు కోవిడ్‌తో పోరాడుతున్నాను. ఇది నన్ను తీవ్రంగా దెబ్బకొట్టింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాను. దయచేసి అందరూ మాస్కులు ధరించండి. వైరస్ వేగంగా వ్యాప్తిస్తోంది... ఒక్కొక్కరినీ ఒక్కో విధంగా ప్రభావితం చేస్తోంది. దురదృష్టవశాత్తు నాపై తీవ్ర ప్రభావం చూపించింది. మరెవరికీ ఇలా జరగొద్దు... దయచేసి అంతా జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికైతే నేను కోలుకునే క్రమంలో ఉన్నాను. ఆరోగ్యం కన్నా ఏదీ ఎక్కువ కాదు... కాబట్టి జాగ్రత్తగా ఉండండి.' నోరా ఫతేహీ (Nora Fatehi) తన ఇన్‌స్టా స్టోరీలో పేర్కొన్నారు.


నోరా ఫతేహీ కరోనా బారిన పడటంపై ఆమె ప్రతినిధి ఒకరు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. 'ప్రోటోకాల్స్‌కి కట్టుబడి నోరా ఫతేహీ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో క్వారెంటైన్‌లో ఉన్నారు. సేఫ్టీ, నిబంధనల విషయంలో బృహన్ ముంబై కార్పోరేషన్ అధికారులకు నోరా సహకరిస్తున్నారు.' అని పేర్కొన్నారు. ఈ నెల 28న నోరా ఫతేహీ కరోనా బారినపడ్డారని... అప్పటినుంచి ఆమె ఇంటి నుంచి కాలు బయటపెట్టలేదని అన్నారు.


కొద్దిరోజుల క్రితమే హీరోయిన్లు కరీనా కపూర్, అమృతా అరోరా కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. బుధవారం (డిసెంబర్ 29) హీరో అర్జున్ కపూర్, అతని సోదరి అన్షుల్లా కపూర్ కరోనా బారిన పడ్డారు. అనిల్ కపూర్ కూతురు రియా కపూర్, ఆమె భర్త కరణ్ బులానీలకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దేశంలో ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తిస్తున్న వేళ బీ టౌన్‌లో కరోనా కేసులు (Covid 19 cases) పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.


Also Read: Rajendrangar Rape Incident: రాజేంద్రనగర్‌లో పదో తరగతి బాలికపై యువకుడి రేప్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook