Mumbai Drugs case: హైదరాబాద్ కు తిరిగొచ్చిన రకుల్ ప్రీత్ సింగ్
ముంబై డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్న బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్ కు తిరిగొచ్చేసింది. తిరిగి షూటింగ్ లో పాల్గొనబోతోంది.
ముంబై డ్రగ్స్ కేసు ( Mumbai Drugs case )లో విచారణ ఎదుర్కొన్న బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ ( Rakul preet singh ) హైదరాబాద్ కు తిరిగొచ్చేసింది. తిరిగి షూటింగ్ లో పాల్గొనబోతోంది.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ( Sushant singh rajput ) మరణంతో వెలుగుచూసిన డ్రగ్స్ వ్యవహారం కేసును ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ( Narcotics control bureau ) దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు ఫ్రీ అయినట్టు తెలుస్తోంది. ఎన్సీబీ సమన్లు అందించడంతో...షూటింగ్ కు బ్రేక్ చెప్పి హుటాహుటిన ముంబై వెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్ కు తిరిగొచ్చేసింది. రకుల్ తిరిగి రావడంతో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ అండ్ టీమ్ రిలాక్స్ అయినట్టు సమాచారం. షూటింగ్ కు సంబంధించిన కీలక సన్నివేశాల పూర్తి చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది.
ముంబై డ్రగ్స్ కేసు విచారణలో రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు దీపికా పడుకోన్ ( Deepika padukone ) , సారా అలీఖాన్ ( Sara Ali khan ), శ్రద్ధాకపూర్ ( Shradha kapoor ) లను ఎన్సీబీ అధికారులు ఇప్పటికే విచారించారు. రకుల్ మరోసారి విచారణకు వెళ్లే అవకాశాలుండటంతో సాధ్యమైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయడానికి క్రష్ టీమ్ ( Director Krish team ) సిద్ధమవుతున్నట్టు సమాచారం. 40 రోజుల సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేయాలన్నది క్రష్ ఆలోచన. యువ నటుడు వైష్ణవ్ తేజ్ హీరోగా...రకుల్ హీరోయిన్ గా వికారాబాద్ అడవుల్లో షూటింగ్ జరుగుతోంది. Also read: Vijay Devarakonda: సుకుమార్ డైరెక్షన్‌లో రౌడీ హీరో సినిమా