Pathaan Movie Collection: అడ్వాన్స్ బుకింగ్‌లో పఠాన్ సినిమా రికార్డు, గంటల వ్యవధిలో 100 కోట్లు దాటేస్తుందా
Pathaan Movie Collection: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అప్‌కమింగ్ సినిమా పఠాన్ విడుదలకు ముందే సంచలనాలు రేపుతోంది. కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ఇప్పుడీ సినిమా మరో చరిత్ర సృష్టించింది. గంటల వ్యవధిలో అడ్వాన్స్ బుకింగ్ ఒక్కటే 100 కోట్లు దాటేసింది.
షారుఖ్ ఖాన్, దీపికా పదుకోన్, జాన్ అబ్రహం నటించిన పఠాన్ సినిమా జనవరి 25 న విడుదలకు సిద్ధంగా ఉంది. బేషరమ్ పాటతో వివాదాస్పదమైన అపారమైన పాపులారిటీ సంపాదించుకుంది. ఇంకా విడుదల కాకుండానే ఈ సినిమా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
షారుఖ్ ఖాన్, దీపికా పదుకోన్, జాన్ అబ్రహంలతో సిద్ధార్ధ ఆనంద్ తెరకెక్కిస్తున్న పఠాన్ సినిమా విడుదలకు ముందే కొత్త కొత్త రికార్డులు సాధిస్తోంది. ఇప్పుడీ సినిమా అడ్వాన్స్ బుకింగ్ విషయంలో సరికొత్త చరిత్ర రేపింది. సినీ నిపుణుల మార్కెట్ అంచనాల ప్రకారం ఈ సినిమా కొన్ని గంటల్లోనే వంద కోట్ల కలెక్షన్లు దాటనుంది.
పఠాన్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. అడ్వాన్స్ బుకింగ్ విషయంలో షారుఖ్ ఖాన్ సినిమా ఇప్పటికే చాలా సినిమాల్ని వెనక్కి నెట్టేసింది. తాజాగా అందుతున్న నివేదికల ప్రకారం పఠాన్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ విషయంలో బాలీవుడ్ టాప్ సినిమాగా నిలిచింది. ఇంతకుముందు హృతిక్ రోషన్ వార్ సినిమాకు ఈ అవార్డు ఉండేది. జనవరి 23వ తేదీ రాత్రి వరకూ పీవీఆర్, ఐనాక్స్, సినీపోలిస్‌లలో ఇప్పటికే 4.19 లక్షల టికెట్లు విక్రయమైపోయాయి. గతంలో వార్ సినిమా టికెట్లు 4.1 లక్షలు విక్రయమయ్యాయి.
గంటల వ్యవధిలో పఠాన్ సినిమా వంద కోట్లు దాటనుందా
సినీ మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం పఠాన్ సినిమా తొలిరోజే 45 కోట్లు దాటి కలెక్షన్ వసూలు చేస్తుందని తెలుస్తోంది. నేషనల్ హాలిడే కావడంతో 60 కోట్లు దాటినా ఆశ్చర్యం లేదంటున్నారు. 48 గంటల్లోనే పఠాన్ సినిమా 100 కోట్ల క్లబ్ దాటేస్తుందంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook