Bollywood: ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే సూపర్‌స్టార్ మహేశ్ బాబు తొలిసారిగా వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్రబిందువయ్యారు. బాలీవుడ్‌పై మహేశ్ చేసిన వ్యాఖ్యలకు ఉత్తరాది స్పందిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఇటీవల బాలీవుడ్ పరిశ్రమపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ తనను భరించలేదని..అందుకే అక్కడికెళ్లి తన సమయం వృధా చేసుకోలేనని మహేశ్ బాబు ఇటీవల ఓ జాతీయ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తెలుగు సినీ పరిశ్రమలో తనకు లెక్కకుమించి గౌరవం లభిస్తుందని..ఈ సమయంలో బాలీవుడ్ కు వెళ్లనని కూడా చెప్పాడు. అయితే ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమై..వివాదంగా మారాయి. 


తన వ్యాఖ్యలపై వివాదం రేగడంతో మహేశ్ బాబు స్పందించాడు. బాలీవుడ్‌పై తనకు గౌరవముందని..తన ఉద్దేశ్యం వేరని చెప్పుకొచ్చాడు. తెలుగు సినీ పరిశ్రమలో హ్యాపీగా, కంఫోర్టబుల్‌గా ఉన్నందునే అక్కడికి వెళ్లనని చెప్పానన్నాడు. అయితే అప్పటికే ఉత్తరాది దర్శకులు మహేశ్ బాబు వ్యాఖ్యలపై కౌంటర్ ప్రారంభించేశారు. ప్రముఖ నిర్మాత ముఖేష్ భట్ ఆ వ్యాఖ్యలపై స్పందించాడు. 


మహేశ్ బాబుపై ప్రశంసలు కురిపించిన బాలీవుడ్ నిర్మాత


మహేశ్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని ముకేష్ భట్ చెప్పుకొచ్చాడు. బాలీవుడ్ అతడిని భరించలేదని భావిస్తే..మంచిదేనని..అతనికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నానన్నాడు. అతడి సినీ ప్రస్థానాన్ని తాను గౌరవిస్తానన్నాడు. మహేశ్ బాబు ప్రతిభ ఉన్న నటుడని..కొన్నేళ్లుగా ఆ ప్రత్యేకతను నిలబెట్టుకున్నాడని కూడా ముకేష్ భట్ ప్రశంసించాడు. అతడొక సక్సెస్‌ఫుల్ నటుడని..కీర్తించాడు. మహేశ్ బాబు అంచనాలను బాలీవుడ్ చేరుకోలేదని అతను భావిస్తే..అందులో తప్పేమీ లేదన్నాడు ముకేష్ భట్. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అంటూ శుభాకాంక్షలు తెలిపాడు. 


ప్రతి ఒక్కరూ ప్రైస్ ట్యాగ్ గురించి ఎందుకు మాట్లాడతారని కూడా ముకేష్ భట్ ప్రశ్నించాడు. ఎవరైనా ఫ్రీగా పనిచేయాలని భావిస్తే అతి అతనిష్టమవుతుందని..అదే సమయంలో వందకోట్లు ఛార్జ్ చేసినా అతనిష్టమే అవుతుందన్నాడు. ఇండస్ట్రీలో నిర్ధారిత ధర అంటూ లేదన్నాడు. పరిస్థితి, డిమాండ్ బట్టి దర్శకులు, హీరోలు, హీరోయిన్ల పారితోషికం మారిపోవడం సహజమేనన్నాడు. 


Also read: Mahesh Babu Comments: బాలీవుడ్ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన మహేశ్ బాబు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook