Mithun Chakraborthy: బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తికి అస్వస్థత... ఆస్పత్రిలో చేరిక!
Mithun Chakraborthy: బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చేరిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Mithun Chakraborthy: బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి (Mithun Chakraborthy) అస్వస్థతకు గురయ్యారు. ఆయన అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చేరినట్టు భాజపా నేత అనుపమ్ హజ్రా (Anupam Hazra) ట్వీట్ చేశారు. ఆయన ట్విట్టర్లో మిథున్ చక్రవర్తి ఫొటోను షేర్ చేసి.. త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. దీంతో మిథున్ ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆందోళ చెందారు. ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన 'ది కశ్మీర్ ఫైల్స్' (The Kashmir Files) చిత్రంలో మిథున్ చివరిసారిగా నటించారు.
క్లారిటీ ఇచ్చిన కుటుంబ సభ్యులు
ఈ విషయంపై మిథున్ చక్రవర్తి ఫ్యామిలీ మెంబర్స్ స్పందించారు. మిథున్ కిడ్నీ సమస్యతో బాధడుతున్నారని.. అందుకే ఆస్పత్రిలో చేరారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సర్జరీ జరిగిందని.. ఆయన క్షేమంగా ఉన్నట్లు వారు తెలిపారు. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఒకప్పుడు హీరోగా బెంగాలీ, హిందీ చిత్రపరిశ్రమలో తనదైన ముద్రవేశారు మిథున్. 1979 స్పై థ్రిల్లర్ సురక్ష, 80లలో డిస్కో డాన్సర్, డ్యాన్స్ డ్యాన్స్, ప్యార్ ఝుక్తా నహిన్, కసమ్ పైడా కర్నే వాలే కి మరియు కమాండో వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు.
Also Read: Rashmika gym Video: జిమ్ లో తెగ కష్టపడుతున్న రష్మిక మందన్నా, వీడియో వైరల్
టెలివిజన్ రియాలిటీ షో ‘'హునర్బాజ్: దేశ్ కి షాన్’'లో కరణ్ జోహార్, పరిణీతి చోప్రాతో పాటు జడ్జిగా వ్యవహారించారు మిథున్ చక్రవర్తి. ఈయన త్వరలో 'ప్రజాపోటీ' అనే బెంగాలీ చిత్రంలో నటించనున్నారు. మిథున్ నటుడు మాత్రమే కాదు భాజపా నేత కూడా.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook