Prabhas Maruthi Movie: ప్రభాస్ -మారుతి సినిమాలో బాలీవుడ్ హీరో.. పెద్ద ప్లానే ఇది!
Bollywood Senior hero to act in Prabhas Maruthi Combo Movie: ప్రభాస్ సినిమాలో ప్రభాస్ తో పాటు ఒక బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కూడా నటిస్తున్నారట. ఆ వివరాలు
Bollywood Senior hero to act in Prabhas Maruthi Combo Movie: బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఇప్పుడు ఆయన చేస్తున్న దాదాపు అన్ని సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన బాహుబలి తర్వాత సాహో అనే సినిమాతో పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. కానీ ఆ సినిమా ఊహించిన మేర అంచనాలను అందుకోలేకపోయింది. ఇక ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్ సినిమా కూడా దాదాపుగా అదే ఫలితాన్ని అందుకుంది. సాహో సినిమా కలెక్షన్లు కొంతమేర రాబడితే, రాధేశ్యామ్ సినిమా మాత్రం భారీ డిజాస్టర్ గా నిలిచింది.
ఈ నేపద్యంలో ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నింటి మీద స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఖచ్చితంగా ఈసారి ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమాలు హిట్ అయ్యే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అవసరమైతే రీషూట్ కి అయినా వెళదామని ప్రభాస్ నిర్మాతలకు చెబుతున్నాడట. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ అందరినీ టెన్షన్ పెట్టే ఒక విషయం ఏమిటంటే ఆయన మారుతీ డైరెక్షన్లో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా షూట్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే విషయం మీద క్లారిటీ లేదు కానీ సినిమా అయితే ఇప్పటికే అధికారికంగా లాంచ్ అయింది. ప్రస్తుతానికి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు భారీగా జరుగుతున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ మారుతీ లాంటి చిన్న డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా చేయడం ఎలా అని ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే మారుతికి గత ట్రాక్ రికార్డు చూసుకుంటే మహానుభావుడు సినిమా తర్వాత సరైన హిట్ ఒక్కటి కూడా లేదు.
అలాంటి డైరెక్టర్ కి ప్రభాస్ ఎలా డేట్స్ ఇచ్చాడా అని వారంతా టెన్షన్ పడుతున్నారు. ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమా పెద్ద బడ్జెట్ తో కాకుండా తక్కువ బడ్జెట్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేశారని ముందు నుంచి ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం ఈ సినిమా గురించి తెర మీదకు వచ్చింది. అదేమిటంటే ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు ఒక బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కూడా నటిస్తున్నారట. అంటే ప్రభాస్ స్టార్ డమ్ తో ఎలాగో తెలుగులో సహా పాన్ ఇండియా లెవల్లో అన్ని భాషల్లోనూ విడుదల చేయడానికి సరిపోతుంది.
కానీ ఇప్పుడు బాలీవుడ్ హీరోని కూడా రంగంలోకి తీసుకొస్తున్నారంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేశారని ప్రచారం అయితే ఊపందుకుంది. కచ్చితంగా మారుతి సినిమా అంటే అది కాస్త కామెడీ యాంగిల్ లో సాగుతూ ఉంటుంది. ప్రభాస్ హీరోగా కామెడీ యాంగిల్ లో వచ్చిన సినిమాలు గతంలో సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మారుతీ డైరెక్షన్లో చేయబోయే సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయం మీద అయితే మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఇక సినీ విశ్లేషకులు మాత్రం చాలా ఆసక్తికరంగా ఈ సినిమా గురించి ఎదురుచూస్తున్నారు. మారుతీ లాంటి డైరెక్టర్ ప్రభాస్ ను ఎలా డీల్ చేయబోతున్నాడు అనే విషయం మీద అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
Also Read: Jr NTR Foot Nara Dogs: జూ.ఎన్టీఆర్ కాళ్ల దగ్గర నారా కుక్కలు.. సోషల్ మీడియాలో రచ్చ!
Also Read: Prabhas Non Stop Shooting: కష్టకాలంలో ప్రభాస్.. పెదనాన్న మరణం మరువక ముందే మూడు నెలల పాటు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook