Sridevi Remuneration: సినీ పరిశ్రమలో హీరోయిన్ల పారితోషికాలు హీరోల కంటే తక్కువే ఉంటాయి. కానీ ఆ సినిమాలో మాత్రం ఆ హీరోయిన్ పారితోషికం ఇంచుమించు మెగాస్టార్ చిరంజీవి పారితోషికంతో సమానంగా ఉందట..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి అగ్రనటుడనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అదే విధంగా తెలుగు, హిందీ చలనచిత్ర పరిశ్రమలో ఒకప్పటి అగ్ర నటి, ప్రేక్షకుల ఆరాధ్య దేవత, అతిలోక సుందరి మాత్రం శ్రీదేవినే. ఇందులో ఎవరికీ ఎటువంటి సందేహం లేదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు ఎదిగిన శ్రీదేవితో మెగాస్టార్ చేసిన అద్వితీయ చిత్రం ఎవరూ మర్చిపోలేరు. ఇద్దరు అగ్రనటులు కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న సినిమా అది. దర్శకుడు రాఘవేంద్ర తెరకెక్కించి సోషల్ ఫాంటసీ చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి.


1990 మే 9న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బంపర్ హిట్ సాధించి 15 కోట్లు వసూలు చేసింది. అప్పట్లో ఇది ఒక రికార్డు. 9 కోట్ల భారీ బడ్జెట్‌తో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మించిన సినిమా ఇది. ఇందులో మెగాస్టార్ చిరంజీవికి ఇచ్చిన పారితోషికం 35 లక్షల రూపాయలు. అప్పట్లో ఇదే అత్యధికం. అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi) తీసుకున్న పారితోషికం కూడా తక్కువేం కాదు. ఏకంగా 25 లక్షల రూపాయలు. హీరో పారితోషికానికి ఇందుమించుగా తీసుకున్న నటి శ్రీదేవి మాత్రమే కావడం విశేషం. ఈ సినిమాకు సీక్వెల్ తీయాలనే ఆలోచన ఉన్నా..అమలు కాలేదు. 


Also read: Bigg Boss Telugu OTT: బిగ్‌బాస్ తెలుగు ఓటీటీలో మాజీ కంటెస్టెంట్లు వీళ్లే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook