Akhanda 2: అఖండ 2 పై క్లారిటీ ఇచ్చిన బోయపాటి.. సినిమా అప్పటివరకు లేదట!
Balakrishna: బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అన్ని ఎంతటి విజయాలు సాధించాయి అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా అఖండ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ క్రమంలో ఈ చిత్రం సీక్వెల్ గురించి బోయపాటి చేసిన కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి..
Boyapati: బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా చేస్తే చాలు ఆ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది అనేది సినీ ప్రేక్షకుల నమ్మకం. అందుకు తగ్గట్టుగానే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ మూడు సినిమాలు కూడా అఖందమైన విజయాలను సాధించాయి. ప్రస్తుతం వరస విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ మరోసారి ఎప్పుడు బోయపాటితో సినిమా చేస్తారు అని నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అఖండ 2 తీయబోతున్నానని గత కొద్ది రోజుల క్రితమే బోయపాటి చెప్పిన సంగతి తెలిసిందే.
ఇక అప్పటినుంచి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అని అందరూ తెగ ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై క్లారిటీ ఇచ్చారు బోయపాటి. ఇప్పుడల్లా ఈ చిత్ర షూటింగ్ లేదు అని చెబుతూ ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారు కూడా చెప్పేశారు.
బాలకృష్ణ ప్రస్తుతం వాల్తేరు వీరయ్య తో సూపర్ సక్సెస్ అందుకున్న దర్శకుడు బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమా చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా షూటింగ్ అయిన తరువాత బోయపాటి సినిమా మొదలవుతుందని అందరూ అనుకున్నారు. అయితే మధ్యలో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ రావడంతో..ప్రస్తుతం బాలకృష్ణ ఎలక్షన్స్ హడావిడిలో ఉన్నారు. NBK 109 సినిమా షూటింగ్ కి కూడా ఎన్నికలు అయ్యేదాకా గ్యాప్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దీంతో ఆ సినిమా షూటింగ్ సైతం ఆలస్యం అవ్వడం ఖాయం.
కాబట్టి ఎలక్షన్స్ అయ్యాకే మళ్ళీ బాలయ్య సినిమాలు మొదలుపెట్టనున్నారు. ఇక ఆ చిత్రం అయిన తరువాత అఖండ 2 షూటింగ్ మొదలపెట్టనున్నారట బాలయ్య. దీంతో అఖండ 2 సినిమా కూడా ఎన్నికలు అయ్యాకే ఉండబోతుంది. తాజాగా బోయపాటి శీను మీడియాతో మాట్లాడారు. కోకాపేటలో నిర్మాత సురేష్ బాబు నిర్మించిన శివ కేశవ మహా సన్నిధానం ఆలయం ప్రారంభోత్సవం జరగగా పలువురు సినీ సెలబ్రిటీస్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో మీడియా వారు బోయపాటిని అఖండ సినిమా గురించి ప్రశ్నించగా.. ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎన్నికల హడావిడి ఉంది. ఎన్నికలు అయ్యాక అఖండ 2 సినిమా అనౌన్స్మెంట్ ఉంటుంది. అఖండలో పసిబిడ్డ ప్రకృతి పరమాత్మ అనే కాన్సెప్ట్ ని చూపించాం. అఖండ 2లో కూడా సమాజానికి కావాల్సిన మంచి కాన్సెప్ట్ తో తీయబోతున్నాము’ అని తెలిపారు.
మొత్తానికి బాబీ సినిమా అవ్వగానే బాలకృష్ణ తదుపరి సినిమా బోయపాటితో ఉండబోతుంది అని క్లారిటీ రావడంతో నందమూరి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
Also read: Jagan Convoy: సీఎం జగన్ పర్యటనలో అపశ్రుతి.. వాహనం ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook