Boycott RRR in Karnataka: `ఆర్ఆర్ఆర్`కి కన్నడిగుల షాక్... సినిమాను బాయ్‌కాట్ చేయాలని పిలుపు...
Boycott RRR in Karnataka: కర్ణాటకలో ఆర్ఆర్ఆర్ సినిమాకు కేటాయించిన థియేటర్లలో కన్నడ వెర్షన్ కన్నా తెలుగు, తమిళ, హిందీ వెర్షన్లకే ఎక్కువ థియేటర్లు కేటాయించారని చెబుతున్నారు.
Boycott RRR in Karnataka: దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' సినిమాకు కర్ణాటకలో గట్టి సెగ తగులుతోంది. ఈ సినిమాను కర్ణాటకలో బహిష్కరించాలంటూ కన్నడ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు '#BoycottRRRinKarnataka' హాష్ ట్యాగ్‌ను ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ కన్నడ డబ్బింగ్ వెర్షన్‌కు కర్ణాటకలో తక్కువ థియేటర్లు కేటాయించడంతో అక్కడి నెటిజన్లు చిత్ర యూనిట్‌పై తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఇది ఒకరకంగా కన్నడిగులను అవమానించడమేనని మండిపడుతున్నారు.
కర్ణాటకలో ఆర్ఆర్ఆర్ సినిమాకు కేటాయించిన థియేటర్లలో కన్నడ వెర్షన్ కన్నా తెలుగు, తమిళ, హిందీ వెర్షన్లకే ఎక్కువ థియేటర్లు కేటాయించారని చెబుతున్నారు. ఢిల్లీ లాంటి హిందీ మాట్లాడే చోట్ల కేవలం ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్‌ను మాత్రమే రిలీజ్ చేస్తున్నారని... కర్ణాటకలో మాత్రం కన్నడ వెర్షన్‌కు తక్కువ థియేటర్లు కేటాయించి, మిగతా భాషల వెర్షన్లకు ఎక్కువ థియేటర్లు కేటాయించడమేంటని కన్నడిగులు ప్రశ్నిస్తున్నారు. తమ భాషకు గౌరవం ఇవ్వని వారి సినిమాను తాము చూడబోమని చెబుతున్నారు.
ఇటీవల కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో జరిగిన గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో డిస్ట్రిబ్యూటర్ వెంకట్ కోణంకి మాట్లాడుతూ... కన్నడ వెర్షన్ రిలీజ్‌కే ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. కన్నడ వెర్షన్‌కి కూడా ఎన్టీఆర్, రాంచరణే స్వయంగా డబ్బింగ్ చెప్పారని పేర్కొన్నారు. కానీ తీరా రిలీజ్ సమయానికి కన్నడ వెర్షన్‌కి థియేటర్లు తక్కువగా కేటాయించడం కన్నడిగులను ఆగ్రహానికి గురిచేస్తోంది. మొత్తం మీద ఆర్ఆర్ఆర్ విడుదలకు ముందు రాజమౌళికి పెద్ద చిక్కు వచ్చి పడినట్లయింది. దీనిపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.
మరోవైపు, ఆర్ఆర్ఆర్ కారణంగా దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ సినిమా జేమ్స్‌ను థియేటర్ల నుంచి తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సినిమా హిట్ టాక్‌తో దూసుకుపోతున్నప్పటికీ.. ఆర్ఆర్ఆర్ కోసం ఈ సినిమాను ఎత్తేసే పరిస్థితి నెలకొంది. దీంతో పునీత్ ఫ్యాన్స్ అప్‌సెట్ అవుతున్నారు. దయచేసి పునీత్ జేమ్స్ సినిమాను రెండో వారం కూడా థియేటర్లలో ప్రదర్శించాలని ఆ సినిమా దర్శకుడు చేతన్ కుమార్ ఎగ్జిబిటర్లకు విజ్ఞప్తి చేశారు.
Also Read: Uttar Pradesh: యూపీలో విషాదం.. టాఫీలు తిని నలుగురు చిన్నారులు మృతి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook